kumaram bheem asifabad- పరిశీలించి.. సూచనలు చేసి..
ABN , Publish Date - Dec 05 , 2025 | 10:42 PM
మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పటు చేసిన పోలింగ్ కేంద్రాలను అదనపు కలెక్టర దీపక్ తివారి శుక్రవారం పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. మండలంలోని గిన్నెధరి, తిర్యాణి మండల కేంద్రంలో కొనసాగుతున్న నామినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది అందించే ఎన్నికల సామగ్రిని కూడా పరిశీలించారు.
తిర్యాణి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పటు చేసిన పోలింగ్ కేంద్రాలను అదనపు కలెక్టర దీపక్ తివారి శుక్రవారం పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. మండలంలోని గిన్నెధరి, తిర్యాణి మండల కేంద్రంలో కొనసాగుతున్న నామినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది అందించే ఎన్నికల సామగ్రిని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా మూడో దశ ఎన్నికలను నిర్వహించడానికి ప్రణాళికను రూపొంచామని తెలిపారు. దూరమున్న పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని పంపించడానికి పారెస్టు వాహనాలను వాడుతున్నామని అన్నారు. అదే విధంగా పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ప్రజలను తరలించడానికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వృద్ధులు, దివ్యాంగులకు పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్ సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. ఆయన వెంట ఎంపీడీవో మల్లేష్, ఎంపీవో ప్రశాంత్, ఏఈ సువాస్, నీతి ఆయోగ్ ప్రత్యేకాధికారి బాలరాజు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఆసిఫాబాద్, (ఆంధ్రజ్యోతి): రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, అదనపు పోలింగ్ అధికారుల మొదటి రాండమైజేషన్ పూర్తి చేశామని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరట్ భవన సముదాయంలో గల వీసీ హాల్‌లో సాధారణ ఎన్నికల పరిశీలకులు శ్రీనివాస్ సమక్షంలో శుక్రవారం పోలింగ్ అదనపు పోలింగ్ అదికారుల మొదటి రాండమైజేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మూడు విడతలలో నిర్వహించనున్న సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నికల కోసం పొలింగ్, అదనపు పోలింగ్ అదికారుల రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్ అధికారులను కేటాయించామని చెప్పాఉ. జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సతదితరులు పాల్గొన్నారు.