kumaram bheem asifabad-పరిశీలించి.. సూచనలు చేసి
ABN , Publish Date - Dec 30 , 2025 | 10:13 PM
కాగజ్‌నగర్ మండలం ఈసుగాం, దహె గాం, పెంచికలపేట పోలీస్‌స్టేషన్ల మంగళవారం ఎస్పీ నితికా పంత్ తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. ఈసుగాం పోలీస్ స్టేషన్‌లో ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు.
కాగజ్‌నగర్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ మండలం ఈసుగాం, దహె గాం, పెంచికలపేట పోలీస్‌స్టేషన్ల మంగళవారం ఎస్పీ నితికా పంత్ తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. ఈసుగాం పోలీస్ స్టేషన్‌లో ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం పలు కేసులపై సూచనలు, సలహాలను అందించారు. ఎస్పీ వెంట డీఎస్పీ వహీదోద్దీన్, ఎస్సై కళ్యాణ్ ఉన్నారు.
దహెగాం/పెంచికలపేట, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): దహెగాం, పెంచికలపేట మండల కేంద్రాల్లోని పోలీసు స్టేషన్‌లను జిల్లా ఎస్పీ నితికా పంత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను, రికార్డులను, కేసుల పురోగతి, హాజరు రిజిస్టర్లను స్టేషన్ శుభ్రత తదితర విభాగాలను పరిశీలించారు. అనంతరం ఆమె ఎస్‌హెచ్‌ఓలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో చట్ట వ్యతిరేక చర్యలు, అసాంఘీక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలన్నారు. మహళలు, బాలికల భద్రతకు సంబందించిన కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, లాండ్ ఆర్డర్ విషయంలో రాత్రి పూట పర్యవేక్షణ, పెట్రోలింగ్‌ను కచ్చితంగా కొనసాగించాలని సూచించారు.
ఆసిఫాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సరం వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ అన్నారు. స్థానికంగా మంగళవారం ఆమె మాట్లాడారు. డిసెంబరు 31 సాయంత్రం నుంచి జిల్లా వ్యాప్తంగా డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నటుల తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేసి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రిపుల్ రైడింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, స్పీడ్ రేసింగ వంటి చర్యలు చట్ట విరుద్దమన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లితండ్రులపై కేసు నమోదు చేస్తామన్నారు. రోడ్లపై కేక్ కటింగ్ చేయడం, టపాకాలు కాల్చడం చట్ట ప్రకారం నేరమని తెలిపారు.