Share News

kumaram bheem asifabad- పరిశీలించి.. సూచనలు చేసి

ABN , Publish Date - Aug 28 , 2025 | 11:25 PM

మండలంలోని ఎన్టీఆర్‌కానీలో వరద ముంపు ప్రాంతాన్ని గురువారం కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే పరిశీలించి అధికారులకు సూచనలు చేశా రు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పారిశుధ్యం, అత్యవసర మరమ్మతు పనులను తక్షణమే చేపట్టాలని చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షం కాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. డ్రేనేజీల్లో పూడిక లేకుండా ముందస్తుగా చర్య లు చేపట్టాలన్నారు

kumaram bheem asifabad- పరిశీలించి.. సూచనలు చేసి
వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

రెబ్బెన , ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎన్టీఆర్‌కానీలో వరద ముంపు ప్రాంతాన్ని గురువారం కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే పరిశీలించి అధికారులకు సూచనలు చేశా రు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పారిశుధ్యం, అత్యవసర మరమ్మతు పనులను తక్షణమే చేపట్టాలని చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షం కాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. డ్రేనేజీల్లో పూడిక లేకుండా ముందస్తుగా చర్య లు చేపట్టాలన్నారు. వరద వచ్చే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. వట్టివాగు డి కాల్వ పూడిక పనులు వెంటనే చేపట్టాలని సూచించారు. అవసరమైన మరమ్మతులు ఎప్పటికప్పుడు చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు. అనంతరం వినాయక విగ్రహాల వద్ద పూజలు చేశారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ సూర్యప్రకాష్‌, సిబ్బంది ఉన్నారు.

పంటలు నష్ట పోయిన రైతుల వివరాలు నమోదు చేయాలి

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల కారణంగా జిల్లాలో పంటలు నష్ట పోయిన రైతుల వివరాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన కలెక్టర్‌ చాంబర్‌ నుంచి మండలాల వ్యవసాయాధికారులు, ఏఈవోలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు కోల్పోయారని అన్నారు. మండలాల్లో ప్రతి భారీగార్షాలు కురిశాయని తెలిపారు. ఏఓలు, ఏఈఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలు నష్ట పోయిన రైతుల వివరాలు సేకరించాలన్నారు. అర్హులైన ప్రతి రైతు పేరు జాబితాలో ఉండాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో అనర్హుల పేర్లు జాబితాలో ఉండకూడదని సూచించారు. నివేదికలు ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.

Updated Date - Aug 28 , 2025 | 11:25 PM