Share News

kumaram bheem asifabad- ఉపాఽధిలో అక్రమాలకు చెక్‌

ABN , Publish Date - Oct 15 , 2025 | 11:13 PM

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఉపాఽఽధి కూలీల ఈకేవైసీ నమోదు ప్రక్రియ జిల్లాలో వేగంగా కొనసాగుతోం ది. కూలీల ఆధార్‌ కార్డులను జాబ్‌ కార్డులతో ఈకేవైసీ చేసుకుంటేనే ఉపాధి పనులు కల్పించాల ని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.

kumaram bheem asifabad- ఉపాఽధిలో అక్రమాలకు చెక్‌
:ఈజీఎస్‌ పనులు చేస్తున్న కూలీలు (ఫైల్‌)

- ఆధార్‌, జాబ్‌కార్డు వివరాలు యాప్‌లో నమోదు

- జిల్లాలో కొనసాగుతున్న ప్రక్రియ

ఆసిఫాబాద్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఉపాఽఽధి కూలీల ఈకేవైసీ నమోదు ప్రక్రియ జిల్లాలో వేగంగా కొనసాగుతోం ది. కూలీల ఆధార్‌ కార్డులను జాబ్‌ కార్డులతో ఈకేవైసీ చేసుకుంటేనే ఉపాధి పనులు కల్పించాల ని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఉపాధి కూలీల ఆధార్‌ కార్డు, జాబ్‌ కార్డు వివరాలను నమోదు చేసి ముఖ గుర్తింపు ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కూలీలు తమ ఆధార్‌ కార్డులతో ఉపాధిహామీ సిబ్బందిని కలిస్తే ఈకేవైసీ నమోదు ప్రక్రియ పూర్తి చేస్తారు. ఇందుకోసం కూలీలు, ఆధార్‌ కార్డును తప్పనిసరిగా అప్‌డేట్‌ చేసుకోవాలి. ఈకేవైసీ పూర్తి చేయని కూలీలు ఇక నుంచి ఉపాధి పనుల్లో అవకాశం కోల్పోతారు.

1.65 లక్షల మంది కూలీలు..

జిల్లాలో ఉపాధిహామీ కూలీలు మొత్తం 1,65,5 41 మంది ఉన్నారు. కూలీల హాజరు నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. కొందరు ఫీల్డ్‌ అసిస్టెంట్లు నకిలీ ఫొటో లను అప్‌లోడ్‌ చేస్తూ నిధులు స్వాహా చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. పనులకు వెళ్లకున్నా హాజరైనట్లు, ఒకరి పేరు మీద మరొకరు వెళ్తున్న ట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సామాజిక తనిఖీల్లో అక్రమాలు బయట పడడం, రికవరీలు జరుగు తున్నా ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ఈ క్రమంలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని సైతం దుర్వినియోగం చేస్తున్న ట్లు అధికారులు గుర్తించారు. దీంతో కూలీలకు కూలి గిట్టుబాటు కాక ఆశించిన స్థాయిలో వేత నాలు రావడం లేదు. దీంతో వీటన్నింటికీ చెక్‌ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీని తప్పనిసరి చేసింది.

హాజరు నమోదు ఇలా..

యాక్టివ్‌ కూలీల వివరాలను మొబైల్‌ యాప్‌లో నమోదు చేసి పనికి రాగానే, పని పూర్తయ్యాక రెండు సార్లు ముఖ గుర్తింపు ఫొటో తీసి అప్‌లోడ్‌ చేయాలి. ఫొటోలు పని ప్రదేశంలోనే తీయాలి. కూలీ వివరాలు యాప్‌లో నమోదు కాకపోతే ఉపాఽ ది పనికి వెళ్లినా హాజరు పడదు. దీంతో కూలీ డబ్బులు ఖాతాల్లో జమ కావు. వేరే ప్రాంతంలో ఫొటో తీసి అప్‌లోడ్‌ చేస్తే జీసీఎస్‌ సిస్టం ద్వారా అది తప్పుడు హాజరని నిర్ధారిస్తుంది. ఈ పద్ధతి ద్వారా ఉపాధిహామీ పథకంలో అవకతవకలను నియంత్రించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో 15 మండలాలు

గ్రామ పంచాయితీలు 335

మొత్తం కూలీల సంఖ్య 1,65,541

ఈకేవైసీ పూర్తి చేసిన కూలీల సంఖ్య 1,10,057

ఇంకా చేయాల్సినవి 55,484

ఫ పకడ్బందీగా ఈకేవైసీ నమోదు

- దత్తారావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

జిల్లాలో ఈకేవైసీ నమోదు ప్రక్రియ పకడ్బం దీగా చేపడుతున్నాం. ప్రస్తుతం అన్ని మండలా ల్లోనూ ముమ్మరంగా కొనసాగుతోంది. జిల్లాలో మొ త్తం 1,65,541 మంది కూలీలు ఉన్నారు. ఇప్పటి వరకు 1,10,057 మంది కూలీల ఈకేవైసీ పూర్తి చేశాం. మిగితా వారివి త్వరలోనే పూర్తి చేస్తాం.

Updated Date - Oct 15 , 2025 | 11:13 PM