Check Dam on Maneru River Collapse: మంథనిలో మానేరుపై కొట్టుకుపోయిన చెక్ డ్యాం
ABN , Publish Date - Dec 18 , 2025 | 02:36 AM
మానేరు నదిపై పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అడవిసోమన్‌పల్లి గ్రామ శివారులో ఉన్న చెక్ డ్యాం బుధవారం కొట్టుకుపోయింది.
మంథని, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): మానేరు నదిపై పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అడవిసోమన్‌పల్లి గ్రామ శివారులో ఉన్న చెక్ డ్యాం బుధవారం కొట్టుకుపోయింది. మూడేళ్ల క్రితమే ప్రభుత్వం రూ. 16 కోట్లతో ఈ చెక్ డ్యామ్‌ను నిర్మించింది. అది సహజంగా దెబ్బతిని కొట్టుకుపోయిందా లేదా నదిలో ఇసుక తవ్వకాల కోసం ఎవరైనా కుట్ర చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెక్ డ్యాం నిర్మాణంలో అధికారులు సరైన నాణ్యత ప్రమాణాలు పాటించక పోవడంతోనే కొట్టుకుపోయిందనే చర్చ కూడా స్థానికంగా నడుస్తోంది. దీనిపై మంథని పోలీసులకు ఇరిగేషన్ ఏఈ ఫిర్యాదు చేశారు.