Falcon Invoice Discounting: ఫాల్కన్ స్కామ్‌లో సీఏ శరత్‌చంద్ర అరెస్ట్
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:14 AM
ఫాల్కన్ ఇన్‌వాయి్‌స డిస్కౌంటింగ్ కుంభకోణం కేసులో చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) శరత్‌చంద్ర తోష్నివాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు.
792 కోట్ల కుంభకోణం కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ఫాల్కన్ ఇన్‌వాయి్‌స డిస్కౌంటింగ్ కుంభకోణం కేసులో చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) శరత్‌చంద్ర తోష్నివాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరిట కంపెనీ పెట్టి ఇన్‌వాయి్‌స డిస్కౌంటింగ్ ద్వారా భారీ లాభాలు వస్తాయని చిన్న, మధ్య తరగతి మదుపరులను నమ్మించి రూ.792 కోట్ల మోసానికి పాల్పడిన కేసులో కంపెనీ సీఏ శరత్‌చంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవలే కంపెనీ ఎండీ అమర్‌దీప్ కుమార్ సోదరుడు సందీప్ కుమార్‌ను అరెస్టు చేశారు.
మొత్తం కుంభకోణానికి సూత్రధారి అమర్‌దీప్ కాగా, ఆయన మోసాలకు శరత్‌చంద్ర సహకరించినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని ఈడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఫాల్కన్ ఇన్‌వాయి్‌సకు వచ్చిన డబ్బును రెహత్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్, రెహత్ హెర్బల్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్‌డీపీ వర్క్ స్టేషన్స్, స్వస్తిక్ ఘీ కంపెనీలకు మళ్లించడంలో శరత్‌చంద్ర ప్రధాన పాత్ర పోషించారని వెల్లడించారు. ఆయా కంపెనీల్లో శర త్‌చంద్ర తన బంధువులు, బినామీల పేరిట షేర్లు తీసుకున్నారని వివరించారు.