B Balakrishna: ఐటీ మినహాయింపు కోరుకునే..సేవా సంస్థలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ABN , Publish Date - Nov 29 , 2025 | 03:35 AM
ఆదాయ పన్ను మినహాయింపు కోరుకునే చారిటబుల్ ట్రస్టులు, సొసైటీలు ఆదాయ పన్ను శాఖ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలంగాణ...
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆదాయ పన్ను మినహాయింపు కోరుకునే చారిటబుల్ ట్రస్టులు, సొసైటీలు ఆదాయ పన్ను శాఖ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలంగాణ, ఏపీ, ఒడిసా రాష్ట్రాల ఆదాయ పన్ను కమిషనర్ (మినహాయింపుల విభాగం) బి.బాలకృష్ణ తెలిపారు. దాతృత్వ సేవల్లో ఉన్న విద్య, వైద్య చారిటబుల్ సంస్థలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల నుంచి విరాళాలు, దానాలు స్వీకరించే ట్రస్టుల వార్షిక రాబడి రూ.5 కోట్లలోపు ఉంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను పొందాల్సిన అవసరం లేదన్నారు. అయితే, ఆయా సంస్థలు ఐటీ రిటర్నులను దాఖలు చేయాలన్నారు. లాభాపేక్ష లేని సంస్థలు పన్ను మినహాయింపు కోసం ఏటా మే 31లోపు తమ వార్షిక స్టేట్‌మెంట్లను సమర్పించాల్సి ఉంటుందన్నారు.