Share News

Shilparamam: ఈ నెల 12 నుంచి 17 వరకు ఛాప్‌ 2025

ABN , Publish Date - Sep 10 , 2025 | 04:55 AM

భారతీయ హస్తకళలు, హస్తకళాకారులను ప్రోత్సహించడానికి ఈ నెల 12 నుంచి 17 వరకూ శిల్పారామంలో జాతీయస్థాయి హస్తకళాఖండాల..

Shilparamam: ఈ నెల 12 నుంచి 17 వరకు ఛాప్‌ 2025

  • శిల్పారామంలో చేనేత హస్త కళాఖండాల ప్రదర్శన

  • రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి వల్లూరు క్రాంతి

హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): భారతీయ హస్తకళలు, హస్తకళాకారులను ప్రోత్సహించడానికి ఈ నెల 12 నుంచి 17 వరకూ శిల్పారామంలో జాతీయస్థాయి హస్తకళాఖండాల ప్రదర్శన (ఛాప్‌-2025) నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి తెలిపారు. ఇందులో భాగంగా హస్తకళాఖండాల ప్రదర్శన, వర్క్‌షా్‌పలు ఏర్పాటు చేస్తున్నామని మంగళవారం మీడియాకు చెప్పారు. పర్యాటక రంగ ప్రాధాన్యం పెంపుదల కోసం నిఫ్ట్‌ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ) ఆధ్వర్యంలో నిర్వహించే ‘ఛాప్‌-2025’కు అవసరమైన సహకారం అందిస్తున్నామన్నారు. నిఫ్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మాలిని దివకళ మాట్లాడుతూ ఛాప్‌-2025లో దేశంలోని వివిధ ప్రాంతాల కళాకారుల హస్తకళాఖండాలు, సంప్రదాయ చేనేత ఉత్పత్తుల ప్రదర్శనలుంటాయన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 04:55 AM