Share News

మార్పు మంచికే..

ABN , Publish Date - Jul 23 , 2025 | 12:02 AM

నకిలీ పత్తి విత్త నాలు, నిషేదిత గడ్డి మందును కట్టడి చేయడంలో పో లీసు, వ్యవసాయ శాఖ అధికారుల కృషి ఫలించింది. జి ల్లా పత్తి రైతుల్లో మార్పు మొదలైంది. రైతన్నలు ఇప్పు డిప్పుడే గ్లైసిల్‌ మాయ నుంచి బయటపడుతున్నారు.

మార్పు మంచికే..

- గ్లైసిల్‌ మాయ నుంచి బయటడుతున్న పత్తిరైతు

-ఈ యేడు నిషేధిత విత్తనాలు, క్యాన్సర్‌ కారక గ్లైఫోసెట్‌ గడ్డి మందుకు దూరం

-జిల్లాలో ప్రభుత్వ ఆమోదిత విత్తనాలనే వేసుకున్న మెజార్టీ రైతులు

-ఫలించిన పోలీసు, వ్యవసాయ శాఖ అధికారుల కృషి

నెన్నెల, జులై 22 (ఆంధ్రజ్యోతి) : నకిలీ పత్తి విత్త నాలు, నిషేదిత గడ్డి మందును కట్టడి చేయడంలో పో లీసు, వ్యవసాయ శాఖ అధికారుల కృషి ఫలించింది. జి ల్లా పత్తి రైతుల్లో మార్పు మొదలైంది. రైతన్నలు ఇప్పు డిప్పుడే గ్లైసిల్‌ మాయ నుంచి బయటపడుతున్నారు. హెచ్‌టీ (హెర్బిసైడ్‌ టాలరెంట్‌) పత్తి సాగు చేస్తే తమ ఆరోగ్యంతో పాటు జీవవైవిద్యానికి ముప్పు వాటిల్లుతుం దని గ్రహించి లూజు విత్తులు, గ్లైఫోసెట్‌ మందుకు దూ రంగా ఉన్నారు. ఈ సీజన్‌లో జిల్లాలో మెజార్టీ రైతులు ప్రభుత్వ ఆమోదిత విత్తనాలనే వేసుకున్నారు. లూజు వి త్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు, వ్యవసాయ శా ఖ అధికారులు విశేషంగా కృషి చేశారు. ఇరు శాఖలు సంయుక్తంగా అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడంతో ఈ యేడు జిల్లాలో గ్లైసిల్‌ సాగు పూర్తిగా తగ్గింది. సరిగ్గా మొలవకపోవడం, ఏపుగా పెరిగి అం తంతమాత్రంగా కాయడం, చీడపీడలు, తెగుళ్లను తట్టు కోక పోవడం, పత్తిలో నాన్యత లేక పోవడం తదితర కారణాలు సైతం రైతులు లూజు విత్తనాలను వీడేలా చేశాయి.

కట్టడిలో అధికారులు సక్సెస్‌..

పదేళ్లుగా జిల్లాలో గ్లైసిల్‌ పత్తి సాగు జోరుగా కొనసా గింది. కలుపు బాధ తీరుతుందనే ఆశతో మాత్రమే హె చ్‌టీ విత్తనాల వైపు రైతులు మొగ్గు చూపేవారు. తక్కు వ ఖర్చుతో కలుపు నివారించవచ్చనే ఆలోచనతప్ప దీర్ఘకాల పర్యవసానాలపై వారికి అవగాహన ఉండేది కాదు. క్యాన్సర్‌ కారకాలున్నాయని, పర్యావరణానికి ము ప్పువాటిల్లుతుందని గ్లైఫోసెట్‌ మందును, హెచ్‌టీ విత్త నాలను ప్రభుత్వం నిషేధించింది. గ్లైసిల్‌ సాగుకు అడ్డు కట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ టీములు ఏ ర్పాటు చేసి నిఘా పెంచింది. పోలీసులు దాడులు చేసి కేసులు పెట్టారు. ఒకటికి రెండు సార్లు పట్టుబడి న వారిపై పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు. ఇ రు శాఖల ఆధ్వర్యంలో గ్రామాల్లో అవగాహన సదస్సు లు నిర్వహించారు. గ్రామాల్లో వివిధ కార్యక్రమాలు చేప ట్టి రైతుల్లో మార్పు తేవడంలో అధికారులు దాదాపుగా విజయం సాధించారు.

జీవవైవిద్యానికి ముప్పు...

కలుపు నివారణకు వాడే గ్లైఫోసెట్‌ మందుతో జీవవై విద్యానికి పూడ్చలేని నష్టం జరుగుతుందని నిఫుణులం టున్నారు. అందులో క్యాన్సర్‌ కారకాలు ఉన్నాయని తే ల్చారు. ఆ మందును పత్తి పంటకు పిచికారి చేస్తే అది పక్కనున్న ఇతర పంటలపైన కూడా ప్రభావం చూపు తుంది. అవి విషపూరితమవుతాయి. పంట ఉత్పత్తుల ను ఆహారంగాతీసుకునే వారిలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మనుషులతో పాటు పశు సంపదపై దు ష్ప్రభావాలు ఉంటాయి. ఇంతేకాకుండా సాగు భూమి ని స్సారమవుతుంది. ఏళ్ల తరబడి మందులు పిచికారి చే స్తే కొన్ని గడ్డిజాతి మొక్కలు అంతరించిపోతాయి. అం తర పంట వేసే వీలుండదు. విత్తనలోపం, ఇతర కార ణాలతో పంట నష్టపోతే కంపెనీలను ప్రశ్నించే వీలుం డదు. బీజీ-3 సాగుతో చేలు విషతుల్యమై భూసారం దెబ్బతింటుంది. ఈ పంటను తిన్న పశువుల పాలను మనుషులు తాగడం వల్లా శారిరకంగా తీవ్ర అనారోగ్య పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. దూదిని వేరు చే సిన తరువాత గింజలను నూనె తీయడానికి వాడుతు న్నారు. ఆ నూనె వాడితే ఆరోగ్యం దెబ్బతింటుంది.

-కలుపు నివారణ కష్టమే అయినప్పటికీ...

పత్తి పంటలో కలుపును అదుపు చేయడం తలకు మించిన భారమే. వాతావరణం అనుకూలిస్తే గుంటుక లు తిప్పుకొని కలుపు అదుపు చేసుకోవచ్చు. కాని అరక ల కొరత కారణంగా ఎక్కువ మంది రైతులు కలుపు ని వారణకు రసాయణాలనే పిచికారి చేస్తున్నారు. పత్తిలో కలుపు నివారణ కోసం మార్కెట్లో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. నిర్ధేశిత సమయంలోగా మం దులు పిచికారి చేయాల్సి ఉంటుంది. పొడి దుక్కిలోనే స్ర్పే చేసుకునే పెండామిథిలిన్‌, విత్తనాలు వేసిన 20 రో జుల్లోగా కలుపు లేతగా ఉన్నప్పుడు స్ర్పే చేసుకునే క్విజలోఫాల్‌ ఏథిల్‌ లేదా ప్రొపాఖిజాపాప్‌, పైరథోబాక్‌ సోడియం లాంటి ప్రభావవంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. అదనులోగా పిచికారి చేస్తే ఈ మందులు కలుపును సమర్ధవంతంగా నివారిస్తాయి. పత్తి చెట్లపై మందు పడకుండా సాళ్ల మధ్యన కలు పుపై మాత్రమే పిచికారి చేసుకునే గ్లుఫోసినేట్‌ అమ్మో నియం, ప్యారాక్వీట్‌ మందులు తక్కువ ధరకే లభిస్తున్నాయి.

నకిలీ విత్తనాలను కట్టడి చేశాం

రవికుమార్‌ ఏసీపీ, బెల్లంపల్లి

పకడ్బందీ ప్రణాళికతో నకిలీ విత్తనాలను కట్టడి చే శాం. టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి సీజన్‌కు ముందు నుం చే కల్తీ దందా చేసే వ్యాపారులు, దళారులపై నిఘా ఏర్పాటు చేశాం. ప్రభుత్వ నిషేదిత హెచ్‌టీ విత్తనాలు, గ్లైఫోసెట్‌ గడ్డి మందుతో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశాం. వ్యవసాయ శాఖ సమన్వయంతో గ్రా మాల్లో కళాజాత ప్రదర్శనలు, ర్యాలీలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రైతులను చైతన్య పరిచాం. తాము చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇచ్చాయి.

రైతుల్లో మార్పు వచ్చింది

-సురేఖ, ఏడీఏ, భీమిని

క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు గ్లైఫోసెట్‌ అనర్థా ల గూర్చి వివరించాం. దళారులు, వ్యాపారుల మాయ మాటలు నమ్మి లూజు విత్తనాల జోలికి వెల్లొద్దని సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన పెంపొందించాం. ఫలితంగా రైతుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఆమోదిత విత్తనాలనే వేసుకుంటున్నారు. గ్లైఫోసెట్‌కు బదులుగా కలుపు నివారణకు మంచి మం దులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. బ్రాండెడ్‌ విత్తనాలతో ఆశించిన దిగుబడి వస్తుంది.

Updated Date - Jul 23 , 2025 | 12:02 AM