Chilly Weather: గజగజ
ABN , Publish Date - Nov 09 , 2025 | 02:39 AM
రాష్ట్రంలో చలి ప్రభావం మొదలైంది. చలి, చలిగాలుల తీవ్రత రోజురోజుకి అధికమవుతోంది. శివారు ప్రాంతాల్లో పొగ మంచు ప్రభావం చూపెడుతోంది. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో .....
రంగారెడ్డి జిల్లా చందన్వెల్లి, తాళ్లపల్లిలో శనివారం 14.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న చలి
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)
రాష్ట్రంలో చలి ప్రభావం మొదలైంది. చలి, చలిగాలుల తీవ్రత రోజురోజుకి అధికమవుతోంది. శివారు ప్రాంతాల్లో పొగ మంచు ప్రభావం చూపెడుతోంది. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చలి రోజురోజుకూ పెరిగిపోతోంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు శనివారం 15 డిగ్రీల దిగువకు పడిపోయాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్వెల్లి, తాళ్లపల్లిలో శనివారం 14.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో శనివారం నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. ఇక, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. పొగ మంచు ప్రభావం అధికంగా ఉండడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.