Share News

kumaram bheem asifabad-గెలుపు వాకిట్లో సమస్యల సవాళ్లు

ABN , Publish Date - Dec 16 , 2025 | 11:00 PM

గ్రామపం చాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సర్పంచ్‌ అభ్యర్థులు ఓటర్లకు గ్రామాల్లో పలు హామీలు ఇచ్చారు. ఇంకొందరు ఏకంగా బాండ్‌ పేపర్లపైనే రాసి సంతకం పెట్టి ఇచ్చారు. గెలిచిన సర్పంచులు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారో లేదో చూడాలి. అసలే గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన లో కుంటుపడి పలు సమస్యలు తాండవిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన సర్పంచులకు సర్పంచు పదవి సవాల్‌గా మారనుంది. గ్రామాల్లో ఉన్న సమస్యలు సర్పంచ్‌లకు స్వాగతం పలకనున్నా యి.

kumaram bheem asifabad-గెలుపు వాకిట్లో సమస్యల సవాళ్లు
లోగో

బెజ్జూరు, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): గ్రామపం చాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సర్పంచ్‌ అభ్యర్థులు ఓటర్లకు గ్రామాల్లో పలు హామీలు ఇచ్చారు. ఇంకొందరు ఏకంగా బాండ్‌ పేపర్లపైనే రాసి సంతకం పెట్టి ఇచ్చారు. గెలిచిన సర్పంచులు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారో లేదో చూడాలి. అసలే గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన లో కుంటుపడి పలు సమస్యలు తాండవిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన సర్పంచులకు సర్పంచు పదవి సవాల్‌గా మారనుంది. గ్రామాల్లో ఉన్న సమస్యలు సర్పంచ్‌లకు స్వాగతం పలకనున్నా యి. ప్రత్యేకంగా గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సమస్య, గ్రామపంచాయతీ నిర్వహణ, ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే గ్రామాల్లో ఎన్నో సమస్యలు తాండవిస్తున్నాయి. వీటికితోడు గ్రామపంచాయతీల నిర్వహణకు నిధులు లేక భారంగా మారింది. ఉన్న సమస్యలు తీరక గెలిచిన సర్పంచులు పలు అభివృద్ధి పనులపై హామీలు ఇచ్చారు. గ్రామంలోని సమస్యలతో గెలిచినా ఎలా నెట్టుకవస్తారో వేచిచూడాలి.

జిల్లాలో 335పంచాయతీలు..

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 335 గ్రామపంచాయతీలుండగా రెండు విడతల్లో 11పం చాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, మూడవ విడత ఎన్నికలు ఈనెల 17న నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోగా, ఆ తర్వాత కాంగ్రెస్‌, బీజేపి పార్టీలు కైవసం చేసుకున్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీలకు చెందిన సర్పంచులు కూడా ఎన్నికల్లో విజయం సాధించడంతో గ్రామాల్లో అభివృద్ధికి అధికార పార్టీ సహకరిస్తుందో లేదో చూడాలి. ఇకనైనా ఐదేళ్ల కాలంలో కుంటుపడిన అభివృద్ధితో వచ్చిన సర్పంచ్‌తోనైనా సమస్యలు తీరుతాయని పలువురు అనుకుంటున్నారు. గెలిచిన సర్పంచులు ఉన్న సమస్యలు పరిష్కరిస్తారో, ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారో లేదో చూడాలి. గ్రామాల్లో సర్పంచు అభ్యర్థులు 35నుంచి 40ఏళ్లలోపే యువత సర్పంచ్‌ లుగా గెలుపొందారు. ఈ యువ సర్పంచులు గ్రామా ల్లోని రూపురేఖలు మార్చాలని పలువురు అంటు న్నారు. ఏది ఏమైనా గెలిచిన సర్పంచులకు పలు సమస్యలు సవాలుగా మారనున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించిన వారికి బాధ్యత మరింత పెరిగిం దని పలువురు అంటున్నారు. గెలిచిన సర్పంచులు ఇచ్చిన హామీలు నెరవేర్చి గ్రామాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. లేక రాతలకే పరిమితమవుతారో వేచి చూడాలి.

Updated Date - Dec 16 , 2025 | 11:00 PM