Share News

Kaloji Kalakshetram: అలరించిన చాకలి ఐలమ్మ నృత్యనాటకం

ABN , Publish Date - Sep 22 , 2025 | 05:36 AM

తెలంగాణ సంగీత, నాటక అకాడమీ ఆధ్వర్యంలో హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ప్రదర్శించిన చాకలి ఐలమ్మ నృత్య నాటిక ఆకట్టుకుంది.

Kaloji Kalakshetram: అలరించిన చాకలి ఐలమ్మ నృత్యనాటకం

ఆకట్టుకున్న అలేఖ్య పుంజాల నటనా కౌశలం

హనుమకొండ కల్చరల్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సంగీత, నాటక అకాడమీ ఆధ్వర్యంలో హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ప్రదర్శించిన చాకలి ఐలమ్మ నృత్య నాటిక ఆకట్టుకుంది. నాటికను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ నేటితరం యువతకు ఐలమ్మ వంటి యోధురాలి గురించి తెలియజేసేలా ఉన్న ప్రదర్శన అద్భుతమన్నారు. ఐలమ్మగా నటన కౌశలాన్ని ప్రదర్శించిన సంగీత, నాటక అకాడమీ చైర్‌పర్సన్‌ అలేఖ్య పుంజాలను ఆయన అభినందించారు. వడ్డెపల్లి కృష్ణ రాసిన ఈ నృత్య నాటకానికి వీబీఎస్‌ మురళి సంగీత స్వరాలను సమకూర్చారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, వరంగల్‌ ఎంపీ కడియం కావ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2025 | 05:38 AM