Telangana Assembly: మండలి పునర్నిర్మాణ పనులు వేగిరం చేయండి
ABN , Publish Date - Sep 10 , 2025 | 05:01 AM
అసెంబ్లీ భవనంలోని శాసన మండలి పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి..
హైదరాబాద్, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ భవనంలోని శాసన మండలి పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శాసనసభ స్పీకర్ ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, సెక్రెటరీ నరసింహాచార్యులు మంగళవారం మండలి పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం స్పీకర్ కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ అధికారులు, ఆగాఖాన్ సంస్థ ప్రతినిధులతో పునర్నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మంగళవారం అసెంబ్లీ లాంజ్‌లో ఆయన చిత్ర పటానికి స్పీకర్ ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాళులర్పించారు