Chairman Kodandareddy: .4కోట్ల స్థలం వ్యవసాయ శాఖకు అప్పగింత
ABN , Publish Date - Nov 07 , 2025 | 02:20 AM
రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారంలో...
రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి ఉదారత
యాచారం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారంలో ఉన్న రూ.4 కోట్ల విలువైన సొంత స్థలం, అందులో నిర్మించిన భవనాన్ని జిల్లా వ్యవసాయశాఖకు గురువారం రిజిస్ట్రేషన్ చేశారు. మండల కేంద్రంలో పదేళ్ల క్రితం ఎం.కోదండరెడ్డి 400గజాల స్థలాన్ని కొనుగోలు చేసి అందులో ఓ భవనాన్ని నిర్మించుకున్నారు. ఈ స్థలాన్నే, అధికారులు కొన్నేళ్లుగా ధాన్యం కొనుగోలు కేంద్రంగా ఉపయోగిస్తున్నారు. ఈ భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తే రైతులకు మరింత ప్రయోజనం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోదండరెడ్డి తెలిపారు. ఏడీఏ సుజాత, ఏవో రవినాథ్.. కోదండరెడ్డిని సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.