Share News

అప్పులు తీర్చేందుకు చైన్‌స్నాచింగ్‌

ABN , Publish Date - Nov 27 , 2025 | 12:08 AM

ఆన్‌లైన్‌లో పేకాట, మద్యానికి బానిసైన ఓ యువకుడు చేసిన అప్పులు తీర్చేందుకు దొంగ అవ తారమెత్తాడు.

అప్పులు తీర్చేందుకు చైన్‌స్నాచింగ్‌
కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రాజశేఖర్‌రాజు

మిర్యాలగూడ అర్బన్‌, నవంబరు26(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌లో పేకాట, మద్యానికి బానిసైన ఓ యువకుడు చేసిన అప్పులు తీర్చేందుకు దొంగ అవ తారమెత్తాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఇటీవల జరిగిన చైన్‌స్నాచింగ్‌ కేసులో యువకుడితోపాటు అతడికి సహకరించిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల డీఎస్పీ రాజశేఖర్‌రాజు కేసు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణంలోని దీక్షిత్‌నగర్‌కు చెందిన మందడి వినోద్‌ కొంతకాలంగా పేకాటకు అలవాటయ్యాడు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో పేకాట ఆడుతూ స్నేహితులు, పరిచయస్థుల వద్ద అప్పులు చేశాడు. అప్పు లు చెల్లించకపోవడంతో అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. దొంగ తనం చేసి తీసుకున్న అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్నాడు. వీధుల్లో ఒంట రిగా వెళ్లే మహిళలు, వృద్ధుల మెడలోని బంగారుపుస్తెల తాడు కాజేయాలని పథకం పన్నాడు. అందులో భాగంగా ఈ నెల 14న తన ద్విచక్రవాహనంపై మిర్యాలగూడకు వచ్చిన నిందితుడు వినోద్‌ పలుకాలనీల్లో తిరిగాడు. బంగారుగడ్డకాలనీలో వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న సిరంశెట్టి లక్ష్మి అనే వృద్ధురాలి మెడలో ఉన్న 3.2తులాల బంగారు పుస్తెలతాడు అపహ రించి హుజూర్‌నగర్‌కు పారిపోయాడు. ఈ విషయాన్ని తన స్నేహితురాలు నజ్మాతో చెప్పి ఏదైనా బ్యాంకులో తాకట్టుపెట్టి నగదు తెచ్చి ఇవ్వాలని కోరారు. అందు కు అమె అగీకరించి శ్రీరామ్‌ ఫైనాన్స్‌లో పుస్తెలతాడు తాకట్టుపెట్టి రూ. 2,30,000 గోల్డ్‌లోన్‌ తెచ్చింది. అలా వచ్చిన డబ్బులో రూ.80వేల అప్పులు తీర్చి, మిగతా రూ.2.30లక్షలతో మళ్లీ పేకాట ఆడి పోగొట్టుకున్నాడు. అప్పులు తీరకపోవడం, జల్సాలకు డబ్బులు లేకపోవడంతో మళ్లీ దొంగతనం చేసేందుకు ఈ నెల 25న వినోద్‌ మిర్యాలగూడలోని రాజీవ్‌చౌక్‌ వద్దకు వచ్చాడు. అనుమానాస్పదంగా తిరుగుతున్న పోలీసులు గమనించి ప్రశ్నిం చారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో అదుపులోకి తీసుకొని విచారిం చారు. విచారణలో తాను చేసిన నేరాన్ని అంగీకరించడంతో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడికి సహకరించిన నజ్మాను అరెస్టుచేసి 3.2తులాల బంగారు గొలుసు, పల్సర్‌బైక్‌, సెల్‌ఫోన్‌, టోపీ, మాస్క్‌, చేతి గడి యారం స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలిం చినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన టూటౌన్‌సీఐ సోమనర్సయ్య, ఎస్‌ఐ రాం బాబు, ఏఎస్‌ఐ చంద్రయ్య, హెడ్‌కానిస్టేబుల్‌ స్వర్ణనాయక్‌, పీసీలు అక్బర్‌ పాషా, లక్ష్మయ్య, రామకృష్ణ, కళ్యాణ్‌, మణిదీప్‌, రాజశేఖర్‌ను డీఎస్పీ అభినందించారు.

Updated Date - Nov 27 , 2025 | 12:08 AM