Share News

kumaram bheem asifabad- పనులు లేక మూతపడిన సీఎఫ్‌సీ

ABN , Publish Date - Nov 14 , 2025 | 09:59 PM

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని వాంకిడి మండల కేంద్రంలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ (సీఎఫ్‌సీ) మూడు నెలలుగా ప్రభుత్వ ఆర్డర్లు లేక మూతపడింది. దీంతో పనులు జరుగక కార్మికులకు ఉపాధి కరువైంది. గతంలో 60 మందికి పైగా కార్మికులకు ఉపాధినందించిన ఈ పరిశ్రమ నేడు పనులు లేక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోం ది.

kumaram bheem asifabad- పనులు లేక మూతపడిన సీఎఫ్‌సీ
వాంకిడిలోని సీఎఫ్‌సీ

- ఉన్నతాధికారులు చొరవ చూపాలని వినతి

ఆసిఫాబాద్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని వాంకిడి మండల కేంద్రంలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ (సీఎఫ్‌సీ) మూడు నెలలుగా ప్రభుత్వ ఆర్డర్లు లేక మూతపడింది. దీంతో పనులు జరుగక కార్మికులకు ఉపాధి కరువైంది. గతంలో 60 మందికి పైగా కార్మికులకు ఉపాధినందించిన ఈ పరిశ్రమ నేడు పనులు లేక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోం ది. ఈ పరిశ్రమపైనే ఆధారపడ్డ కార్మికులు ఉపా ధి దొరకక వీధిన పడాల్సిన పరిస్థితి నెలకొంది. పనులు లేకపోవడంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. ఒకప్పుడు పనులతో కళకళలాడిన పరిశ్రమ నేడు ప్రభుత్వ ఆర్డర్లు లేక వెలవెలబో తోంది. గతంలో పరిశ్రమ మూత పడి ఉండగా అప్పటి ఐటీడీఏ పీగా పనిచేసిన వరుణ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌గా పనిచేసిన చాహత్‌బాజ్‌పాయ్‌ సీఎఫ్‌సీ అభివృద్దికి ప్రత్యేక చొరవ తీసుకొని రూ. 3 లక్షల విలువ చేసే కలప తయారీకి ఆర్డర్‌ ఇవ్వడంతో పరిశ్రమ తిరిగి తెరుచుకుంది. అనంత రం బెంగుళూరుకు చెరందిన బెల్‌ (భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌) కంపెనీ నుంచి రూ. 34 లక్షల విలువ చేసే 500 డ్యూయల్‌ డెస్క్‌లు ఆర్డర్‌ రావడంతో తిరిగి పరిశ్రమలో పనులు కొనసాగా యి. ఆతరువాత ఎలాంటి ప్రభుత్వ ఆర్డర్‌లు రాక కార్మికులకు పనులు లేక ఇబ్బం దులు తప్పడం లేదు. అధికారులు దృష్టి సారిస్తే పరిశ్రమకు పూర్వవైభవం రానుంది.

ఫ 1971లో ప్రారంభం..

రాష్ట్రంలో 1971లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో 56 సీఎఫ్‌సీ (కామన్‌ ఫెలిలిటీ సెంటర్‌) కేంద్రాలను ప్రారంభించారు. అందులో భాగంగానే అప్పటి తాలుకా కేంద్రమైన వాంకిడిలో 9 వేల రూపాయలతో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని కేంద్రాలు మూతపడగా ఆదరణ పొందిన ఈ సంస్థ మాత్రమే ఉనికిని చాటుకుని నడుస్తూ వచ్చింది. కలపతో అందమైన వస్తువులు తయారు చేయడంలో ఇక్కడి కార్మికుల ప్రతిభ ఆమోఘం. భవనాలకు అమర్చే తలుపులు, కిటికీలు, టేబుల్లు, సోఫాసెట్‌లు, రాకింగ్‌ చైర్లు, డైనింగ్‌ టేబుల్‌, డ్రెస్సింగ్‌ టేబుల్‌, తదితర వస్తువులు తయారు చేస్తారు. వాటి రూపక్పనలో కార్మికులు తమ ప్రత్యేకతను ప్రదర్శిస్తారు. కలపతో ఫర్నిచరే కాకుండా ఇనుముతో బీరువాలు, బెడ్‌లు, డ్యూయల్‌ డెస్క్‌లు తదితర వస్తువులు తయారుచేస్తుంటారు. ప్రస్తుతం కలప లభ్యం కాకపోవడంతో ఇనుముతోనే వస్తువులను తయారు చేస్తున్నారు. 1980లో ఈ సంస్థను ఐటీడీఏ ఆధీనంలో తీసుకుని నిరుద్యోగ గిరిజన యువతకు కర్రతో ఫర్నిచర్‌ తయారీలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. యువతకు శిక్షణతోపాటు ఉపాధి అవకాశం కల్పించాన్న ఉద్దేశంతో 1987-88లో ఐటీడీఏ ఆధ్వర్యంలో కార్మికుల సౌకర్యార్థం షెడ్లు, భవనాలు నిర్మించి ఫర్నిచర్‌ తయారీకి అవసరమైన పరికరాలను సమకూర్చి ఆధునీకరించారు. 1991 నాటికి 335 మందికి వృత్తి శిక్షణ ఇచ్చారు.

ఫ కలప కొరత ఏర్పడడంతో..

కాలక్రమేణా కలప కొరత ఏర్పడడంతో 1998-99 లో మెటల్‌ వర్క్స్‌తో తయారు చేయడం ప్రారంభించారు. సీఎఫ్‌సీ పనితనాన్ని గుర్తించిన అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ సుకుమార్‌ ఈ సంస్థ అభివృద్దికి 14 లక్షల రూపాయలను మంజూరు చేశారు. అనతంరం కొంత మంది అప్పటి ఐటీడీఏ అధికారులు ఆర్థిక సహాయం అందిచడంతో ఆధునిక యంత్రాలను సమకూర్చారు. 2012లో పనులు లేక ఈ పరిశ్రమ సంక్షభంలో చిక్కుకుంది. అప్పటి నుంచి జూలై 2015 వరకు పరిశ్రమ మూతపడింది. దీంతోఈ పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికుల ఉపాధిని కోల్పోయి ఇబ్బందులు పడ్డారు. అనంత రం అప్పటి ఐటీడీఏ పీవో ఆర్‌వీ కర్ణన్‌ సీఎఫ్‌సీని సందర్శించి పరిశ్రమను పునరుద్ధరించే దిశగా చర్యలు తీసుకున్నారు. ఆరు లక్షల రూపాయల కార్పస్‌ నిధులను మంజూరు చేసి తిరిగి సీఎఫ్‌సీని పునఃప్రారంభించారు. తరువాత ప్రభుత్వ అర్డర్లు లేకపోవడంతో తిరిగి పరిశ్రమ మూతపడింది. మూడేళ్ల క్రితం అప్పటి కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ 4.5 లక్షల రూపాయల విలువ గల బెంచీలు తయారు చేసేందుకు ఆర్డర్‌ ఇవ్వడంతో కొన్ని నెలల పాటు పరిశ్రమ కొనసాగింది. తరువాత ఆర్డర్లు లేక తిరిగి మళ్లీ మూతపడింది. ఆ తరువాత ఐటీడీఏ పీవోగా పనిచేసిన వరుణ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌గా పనిచేసి న చాహత్‌బాజ్‌పాయ్‌ ప్రత్యేక చొరవ తీసుకొని మూడు లక్షల రూపాయలు విలువ చేసే కలప తయారికి ఆర్డర్‌ ఇవ్వడంతో పరిశ్రమ తిరిగి తెరుచుకుంది. అనంతరం బెంగుళూరుకు చెందిన బెల్‌ (భారత్‌ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌) కంపెనీ నుంచి 34 లక్షల రూపాయలు విలువ చేసే 500 డ్యూయ ల్‌ డెస్క్‌లు ఆర్డర్‌ రావడంతో తిరిగి పరిశ్రమ గాడిన పడింది. అనంతరం పెద్దపల్లి జిల్లా నుంచి రూ. 13 లక్షల పనులకు ఆర్డర్‌లు రావడంతో పనులు కొనసాగాయి. ప్రస్తుతం ఆర్డర్లు లేకపోవ డంతో మూడు నెలల నుంచి కార్మికులు పనులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్నతాధి కారులు స్పందించి ప్రభుత్వ ఆర్డర్లు వచ్చేలా చొరవ చూపితే సీఎఫ్‌సీకి పూర్వవైభవం రానుంది.

ఫ ఉపాధి కరువైంది..

- మడావి పైకాజీ, సీఎఫ్‌సీ ఇన్‌చార్జి

సీఎఫ్‌సీకి ప్రభుత్వ ఆర్డర్లు రాకపోవడంతో ఉపాధి కరువైంది. గతంలో ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఫర్నిచర్‌ ఆర్డర్లు వచ్చేవి. దీంతో 60 మంది కార్మికులకు ఉపాధి ఉండేది. గతేడాది వరకు అధికారులు ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వడంతో పనులు సాగాయి. ప్రస్తుతం ఆర్డర్లు లేక పోవడంతో పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. సీఎఫ్‌సీకి ప్రభుత్వ ఆర్డర్లు లభించేలా ఉన్నతాధి కారులు చొరవ చూపాలి.

ఫ ప్రభుత్వ ఆర్డర్లతోనే మనుగడ..

- రాము, కార్మికుడు

పరిశ్రమ ప్రధానంగా ప్రభుత్వ ఆర్డర్లపై ఆధారపడి మనుగడ కొనసాగిస్తోంది. ఆర్డర్లు ఉన్న సమయాల్లో కార్మికులకు ఉపాధి ఉంటుంది. పనులు లేని సమయంలో కార్మికులకు కుటుంబ పోషణ సైతం భారంగా మారింది. ఈ పరిశ్రమపై ఆధారపడి ఉన్న మాకు ప్రస్తుతం పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఉన్నతాధికా రులు ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ ఆర్డర్లు అం దించి కార్మికులను ఆదుకోవాలి.

Updated Date - Nov 14 , 2025 | 09:59 PM