Share News

సర్టిఫికెట్లు ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:32 AM

Certificates can be taken any number of times.

 సర్టిఫికెట్లు ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు

సర్టిఫికెట్లు ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు

అవగాహన లోపంతో సమయం వృథా

చండూరు, మార్చి 10(ఆంధ్రజ్యోతి): పోగొట్టుకున్న ధ్రువీకరణ పత్రాలు కొన్నింటిని తిరిగి తక్కువ సమయంలోనే పొందవచ్చు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు ప్రజలు అవగాహన కల్పించకపోవడంతో ప్రజలు సమయం, డబ్బు వృథా చేసుకుంటున్నారు. మీసేవా కేంద్రాల నిర్వాహకులు కూడా దరఖాస్తుదారులకు వివరించకపోవడంతో, వారి దందా మూడు పూవులు ఆరుకాయలుగా మారుతోంది. రెండు నెలల క్రితం ఓ ఇంటర్‌ విద్యార్థి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాడు. తహసీల్దార్‌ కార్యాలయంలో తీసుకున్నాడు. అయితే ఆ విద్యార్థి బస్సు ప్రయాణంలో పోగొట్టుకున్నాడు. వాటిని తిరిగి పొందడానికి కోసం మళ్లీ మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో అతనికి మూడు, నాలుగు రోజులు సమయం పట్టింది. అతనొక్కడే కాదు చాలా మంది ఇలానే తిరిగి దరఖాస్తు చేకుంటూ సమయం వృథా చేసుకుంటున్నారు.

అవగాహనతో సమయం ఆదా

సాధారణంగా ఉపకార వేతనాలు, పలు రకాల దరఖాస్తుల కోసం ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా మారాయి. వాటి కోసం మీసేవా కేంద్రాల్లో కావాల్సిన పత్రాలను చూపించి దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఈ పత్రాలు పోగొట్టుకున్నా లేదా వాటి ఒరిజినల్‌ పత్రాలను తిరిగి పొందాలన్నా కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవస రం లేదు. ఏడాదిలో ఎన్నిసార్లు అయినా మీసేవా కేంద్రాల్లో కేవలం కొద్ది నిమిషాల్లోనే వాటిని తిరిగి తీసుకునే అవకాశం ఉంది. ఈ అవకాశం చాలా మందికి తెలియక విద్యార్థులు, ప్రజలు వాటి కోసం మరలా తిరిగి దరఖాస్తు చేసుకుని కార్యాలయాల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. మీసేవా ఉన్నతాధికారులు ఒకసారి పొంది న పత్రాలను ఏడాదిలోపు ఎన్నిసార్లైనా రుసుం చెల్లించి తీసుకునే వెసులుబాటు కల్పించారు.

రుసుం చెల్లించి పొందవచ్చు

ఒక వ్యక్తి ఆదాయ ధ్రువీకరణ పత్రం ఏడాదిలో ఒక్కసారి మా త్రమే దరఖాస్తు చేసుకోవాలి. మొదటిసారి తీసుకున్న కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి దరఖాస్తు రశీదుపై అప్లికేషన నెంబర్‌ ఉంటుంది. తిరిగి అదే ధ్రువీకరణ పత్రం అవసరమైతే నేరుగా మీసేవా కేంద్రానికి వెళ్లి మొదటిసారి చేసిన దరఖాస్తు లేదా ఆధార్‌ నెంబర్‌ నమోదు చేయగానే గతంలో పొందిన ధ్రువీకరణ పత్రాల వివరాలు కం ప్యూటర్‌ కనిపిస్తాయి. అప్పుడు చిరునామా, మొబైల్‌ ఫోన నెంబర్‌ నమోదు చేసి రూ.35 చెల్లిస్తే సరిపోతుంది. వెంటనే తిరిగి పత్రాలను తీసుకునే అవకాశం ఉంది.

- దశరథ, తహసీల్దార్‌, చండూరు

Updated Date - Mar 11 , 2025 | 12:32 AM