Union Minister Kishan Reddy: తెలంగాణలో విద్యాభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Oct 02 , 2025 | 05:29 AM
తెలంగాణపై కేంద్రం ప్రత్యేక శ్రద్ద చూపుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణకు నాలుగు...
న్యూఢిల్లీ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణపై కేంద్రం ప్రత్యేక శ్రద్ద చూపుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణకు నాలుగు కేవీలు మంజూరు చేయడం పట్ల కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 35 కేవీలు ఉండగా తాజాగా మరో నాలుగు మంజూరయ్యాయి. కొత్తగూడెం, ములుగు జిల్లా కేంద్రాలతోపాటు జగిత్యాల రూరల్ మండలంలోని చెల్లల్, వనపర్తి జిల్లాలోని నాగవరంలో కేవీలు మంజూరయ్యాయని తెలిపారు. అలాగే, గత రెండేళ్లలో తెలంగాణకు రూ.400 కోట్లతో 832 పీఎంశ్రీ స్కూళ్లను మంజురు చేశామన్నారు. దేశంలో అత్యధిక పీఎంశ్రీ స్కూళ్లు తెలంగాణకే కేటాయించారని తెలిపారు. సమగ్రశిక్షా అభియాన్ కింద గత రెండేళ్లలో తెలంగాణకు దాదాపు రూ.2 వేల కోట్లను కేటాయించినట్టు తెలిపారు.