కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు విరించాలి
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:32 PM
గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తు న్న పథకాలను ప్రజలకు వివరించాలని బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు.

-బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్
నెన్నెల, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తు న్న పథకాలను ప్రజలకు వివరించాలని బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. పార్టీ మం డల అధ్యక్షుడు అంగలి శేఖర్ అధ్యక్షతన మండ లంలోని గొళ్లపల్లిలో బుధవారం నిర్వహించిన క్రీయశీల సభ్యులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం ని ధులతోనే ప్రజలకు ఉచిత బియ్యం, సీసీ రోడ్లు నిర్మాణా లు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా కాంగ్రెస్ నాయకులు చేసుకుంటున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. డీలర్‌షాపుల వద్ద ప్రధాని నరేంద్ర మోదీ చిత్ర పటాన్ని ఏర్పాటు చేయాలన్నారు. బూత్‌స్థా యిలో పార్టీని బలోపేతం చేసి, గ్రామాల్లోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని సూచిం చారు. జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటి సారిగా మండలానికి వచ్చిన వెంకటేశ్వర్‌గౌడ్‌ను మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ కన్వీనర్ రాచర్ల సంతోష్, నాయకులు కోట వంశీ, శైలెందర్‌సింగ్, యాద గిరి, గడ్డం శ్రీనివాస్‌గౌడ్, రత్న అరుణ్, కొడిపే మహేం దర్, అంకులు, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
బూత్‌స్ధాయిలో పార్టీని బలోపేతం చేయాలి
కన్నెపల్లి : బీజేపీని బూత్ స్థాయిలో బలోపేతం చే యాలని జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ పే ర్కొన్నారు. బుధవారం కన్నెపల్లిలో క్రీయాశీల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగి ఉన్న పార్టీ బీజేపీ అని తెలిపారు. పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనం గా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్ర మంలో మాజీ సర్పంచు పుల్లూరి రాజయ్య, ఓబీసీ మో ర్చా అధ్యక్షుడు బర్ల పోశన్న పాల్గొన్నారు.
భీమిని : మండలంలో పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్క కార్యకర్త కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగు నూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. బుధవారం మండలం లోని బిట్టూరుపల్లి గ్రామంలో కీయాశీల సభ్యులు, కార్య కర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్య కర్తలకు దిశా నిర్దేశం చేశారు. జిల్లా అధ్యక్షుడికి కార్య కర్తలు షాలువాలతో సన్మానం చేశారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు కొంక సత్యనారాయణ, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ, బెల్లంపల్లి అసెంబ్లీ కన్వీ నర్ రాచర్ల సంతోష్, పురుషోత్తం గౌడ్ పాల్గొన్నారు.