Centenarian Pochamma Celebrates: అవ్వకు 110 ఏళ్లు
ABN , Publish Date - Sep 15 , 2025 | 05:08 AM
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన పోచమ్మకు ఆదివారం (సెప్టెంబర్ 14)తో 110 ఏళ్లు నిండాయి...
ఓదెల, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన పోచమ్మకు ఆదివారం (సెప్టెంబర్ 14)తో 110 ఏళ్లు నిండాయి. దీంతో కుటుంబసభ్యులు అందరూ కలిసి ఆదివారం ఆమె జన్మదిన వేడుకలను నిర్వహించారు. పోచమ్మ, మైసయ్య దంపతులకు అయిదుగురు కుమార్తెలు, అయిదుగురు కుమారులు సంతానం కాగా ఇప్పుడు ఆ కుటుంబంలో మొత్తం వందమందికి పైగా ఉన్నారు. తెలుగు సంవత్సరాల ప్రకారం పోచమ్మ జన్మించిన ఏడేళ్లకు కీలకనామ సంవత్సరం వచ్చిందట. దీని ప్రకారం 1915లో ఆమె జన్మించినట్లుగా కుటుంబసభ్యులు నిర్ధారించారు. పోచమ్మకు 110 ఏళ్లు నిండినా నేటికీ ఆరోగ్యంగా ఉంది. పోచమ్మ భర్త మైసయ్య, పెద్దకుమారుడు మల్లయ్య మృతి చెందారు.