kumaram bheem asifabad- తరగతి గదిలో సెల్ వాడొద్దు
ABN , Publish Date - Jun 26 , 2025 | 11:22 PM
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇకపై తరగతి గదిలో సెల్‌ఫోన్ మాట్లాడడం నిషేధం. ఈ విష యమై విద్యాశాఖ కొద్ది రోజుల క్రితం స్పష్టమైన ఆదే శాలు జారీ చేసింది. తరగతి గదిలో సెల్‌ఫోన్ మా ట్లాడితే చర్యలు ఉంటాయని వెల్లడించింది.
- కొన్ని పాఠశాలల్లో నామమాత్రంగా అమలు
- హెచ్‌ఎంల వద్ద ఉంచాలన్న నిబంధనలు బేఖాతర్
- పిల్లల చదువుపై ప్రభావం పడే అవకాశం
- ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇకపై తరగతి గదిలో సెల్‌ఫోన్ మాట్లాడడం నిషేధం. ఈ విష యమై విద్యాశాఖ కొద్ది రోజుల క్రితం స్పష్టమైన ఆదే శాలు జారీ చేసింది. తరగతి గదిలో సెల్‌ఫోన్ మా ట్లాడితే చర్యలు ఉంటాయని వెల్లడించింది.
వాంకిడి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠ శాలల్లో తరగతి గదుల్లోకి ఉపాధ్యాయులు సెల్‌ఫోన్ తీసుకెళ్లకూడదనే నిబంధన అమల్లో ఉంది. తరగతి గదిలోకి వెళ్లే ముందు సెల్‌ఫోన్లను ప్రధానోపాధ్యాయు లకు అప్పగించాలని విద్యాశాఖ గతంలోనే ఉత్తర్వు లు జారీ చేసింది. కానీ పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించే సమయంలోనూ వినియోగిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విద్యాశాఖ మరోసారి తరగతి గదుల్లో సెల్‌ఫోన్‌ల వినియోగాన్ని నిషేధిస్తూ జిల్లా విద్యా శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. తప్పనిసరిగా అమలు చేయాలని, విరుద్ధంగా వ్యవహ రిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించింది.
- బోధనకు ఆటంకం..
తరగతి గదిలో ఉపాధ్యాయులు సెల్‌ఫోన్ ఉపయో గించడం వల్ల పాఠశాల సమయం వృథా కావడంతో బోధనకు ఆటంకం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఆపటు విలువైన సమయాన్ని విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుంది. బోధన విషయంపై ఏకాగ్రత కోల్పోతున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల ను అనుకరిస్తూ ఇంటి వద్ద సెల్‌ఫోన్‌లను ఉపయోగి స్తున్నారు. పూర్తిస్థాయిలో చదువును పక్కనబెట్టి గంటల తరబడి సెల్‌పోన్లకే పరిమితమవుతున్నారు. తద్వారా క్రమశిక్షణ దూరమై, క్రమేపి చదువుల్లో వెనుకబడిపోతున్నారు. మరోవైపు కొందరు ఉపాధ్యా యులు తమ సొంత వ్యాపారాల కోసం పాఠశాల సమయాన్ని వృథా చేస్తున్నారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి.
- విద్యా సంవత్సరం ప్రారంభంలో..
విద్యాశాఖ ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో తరగతి గదుల్లో సెల్‌ఫోన్ వినియో గాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తోంది. ప్రాథమిక, ప్రథమికొన్నత, ఉన్నత పాఠశాలల్లో బోధించే మేజారిటీ ఉపాధ్యా యులు ఈ నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. కొంత మంది మాత్రం నిబంధనలకు తిలోదకాలిస్తూ తరగతి గదుల్లో యథేచ్ఛగా వినియో గిస్తున్నారు. సెల్‌ఫోన్ వినియోగంపై పాఠశాలలోని ఉపాధ్యాయుల మధ్య వివాదాలు తలెత్తిన సంఘట ణలు సైతం ఉన్నాయి. ఉన్నతాధికారులు హెచ్చరిం చినా కొందరు ఉపాధ్యాయులు తమ పనితీరు మార్చుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెల్‌ఫోన్ వినియోగంపై ఉన్నతాధికారులు చూసీచూ డనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులు నిబంధనలను పట్టించుకోవడం లేదు. కొదంరైతే తరగతి గదుల్లోనే సామాజిక మాధ్యమాలను వాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
- నిబంధనల ప్రకారం..
తాజాగా విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఉపాధ్యా యులు తరగతి గదిలోకి వెళ్లే ముందు సెల్‌ఫోన్‌లను ప్రధానోపాధ్యాయుడి వద్ద భద్రపర్చాలి. ఏదేని అత్యవ సరం ఉంటే ప్రధానోపాధ్యాయుడి అనుమతితో మాటా ్లడుకునే వీలుంటుంది. తరగతి గదిలో ఉపాధ్యాయు లు సెల్‌ఫోన్ వినియోగించినట్లు నిర్ధారణ అయితే ఆయనతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సైతం బాధ్యత వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
చర్యలు తీసుకుంటున్నాం..
- శివచరణ్‌కుమార్, ఎంఈవో
పాఠశాల సమయంలో సెల్‌ఫోన్లు వినియోగించ కుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇదివ రకే అన్ని పాఠశాల ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. ఎప్పటికప్పుడు పాఠశాలలను సందిర్శిస్తూ ఉపాధ్యా యుల సమావేశాల్లో సైతం సెల్‌ఫోన్‌లను పాఠశాల సమయంలో అవసరం లేని విషయాల్లో వినియోగిం చకుండా చర్యలు తీసుకుంటున్నాం. పాఠశాలల్లో సెల్ ఫోన్ వినియోగిస్తున్నట్లు మా దృష్టికి వస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.