Share News

ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:01 AM

వినాయక నవరాత్రి ఉ త్సవాలను మతసామరస్యానికి ప్రతీక గా నిలిచేలా శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సీపీ అంబర్‌కిషోర్‌ ఝా అన్నారు.

ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి

రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా

మంచిర్యాలక్రైం,ఆగస్టు23 (ఆంధ్రజ్యోతి): వినాయక నవరాత్రి ఉ త్సవాలను మతసామరస్యానికి ప్రతీక గా నిలిచేలా శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సీపీ అంబర్‌కిషోర్‌ ఝా అన్నారు. శాంతి సమావేశంలో ఆ యన మాట్లాడుతూ మత పెద్దలతో గణే ష్‌ చతుర్థి, మిలాద్‌ ఉన్‌ నబి పండగల దృష్ట్య ఈ సమావేశం ఏర్పాటు చేశారు. గత సంవత్సరం రామగుండం కమిషనరే ట్‌ పరిధిలో 4786 విగ్రహాలను ఏర్పాటు చేయగా మంచిర్యాల జోన్‌లో 2316 వినా యక విగ్రహాలు ఏర్పాటు చేశారన్నారు. వి నాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునేవా రు అన్ని వివరాలతో సంబంధిత పోలీసు స్టేషన్‌లో అనుమతి తప్పనిసరిగా తీసుకో వాలన్నారు. శోభయాత్ర సాఫీగా సాగేలా రోడ్డు మ్యాప్‌ ఏర్పాట్లు పర్యావేక్షిస్తామ న్నారు. గణపతి మండపాల వద్ద జరిగే కార్యక్రమాలకు బాధ్యత వహిస్తూ ప్రతి ఒక్క గణపతి మండప కమిటీ అధ్యక్షులు ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలన్నారు. మద్యం సేవించి మండపాల వద్దకు రావ ద్దన్నారు. తప్పనిసరిగా విద్యుత్‌శాఖ వారి అనుమతి తీసుకోవాలని నాణ్యమైన వైర్ల ను పరికరాలను వినియోగించి ప్రమాదా లను నివారించేందుకు చర్యలు చేపట్టాల న్నారు. కొంత మంది సోషల్‌ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు పుకారలతో ఇత రుల మనోభవాలు దెబ్బతినేలా పోస్టు పె ట్టే అవకాశం ఉందని ప్రజలు వాటిని న మ్మవద్దని సమన్వయం పాటించాలన్నా రు. అత్యవసర సమయంలో వందకు గాని లేదా 8712656597 సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, మంచిర్యాల డీసీపీలు కరుణాకర్‌, భాస్కర్‌, స్పెషల్‌ బ్రాంచి ఏసీపీ మల్లా రెడ్డి, గోదావరిఖని ఏసీపీ మహేశ్‌, జైపూర్‌ ఎసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌, పీస్‌ కమిటీ సభ్యులు అన్ని మతాల పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 12:01 AM