శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలి
ABN , Publish Date - Aug 21 , 2025 | 10:53 PM
జిల్లా కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతి యుత వాతావరణంలో ఎలాంటి అపశృతి జరుగకుండా జాగ్రత్తలు పాటిస్తూ నవరాత్రి ఉత్సవాలు నిర్వ హించుకోవాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ అన్నారు.
శాంతి సమావేశంలో మాట్లాడుతున్న ఏసీపీ ప్రకాశ్
మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్
మంచిర్యాలక్రైం, ఆగస్టు21 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతి యుత వాతావరణంలో ఎలాంటి అపశృతి జరుగకుండా జాగ్రత్తలు పాటిస్తూ నవరాత్రి ఉత్సవాలు నిర్వ హించుకోవాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ అన్నారు. గురువారం ఎంకన్వెన్షన్ హాల్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాల శాంతి కమిటీని ముఖ్యఅతిథులుగా ఆర్డీవో శ్రీనివాస్‌రావు, నగరపాలక కమిషనర్ సంపత్, తహసీల్దార్ రఫాతుల్లా హుస్సేన్, ఫైర్ జిల్లా ఫైర్ అధికారి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు గణేష్ మండపానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినవారిని బైండోవర్ చే స్తామని, గణేష్ మండపాల వద్ద, గణేష్ నిమజ్జనం ఉత్సవం సందర్భంగా ఎవ్వరు కూడ మద్యం సేవిం చరాదని సూచించారు. మండపాల వద్ద న్యూసెన్స్‌కు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామ న్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ ముఖ్యంగా మండపాల వద్ద ఎలక్ర్టిసిటీ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఏ చిన్న పొరపాటు జరిగిన విద్యుదాఘాతంతో ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. అగ్ని ప్రమాదాలు జరుగకుండా ముందస్తు చర్యలు పాటించాలన్నారు. ని మజ్జన కార్యక్రమంలో భాగంగా యువత భక్తి శ్రద్ధలతో పాల్గొనాలని అనవసరమైన గొడవల్లో తల దూర్చి తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దన్నారు. ప్రతి ఒక్కరు సమయం ప్రకారం రాత్రి 12లోపే నిమిజ్జనం కార్యక్రమం పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ ప్రమోద్‌రావు, ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ పాల్గొన్నారు.