Share News

Praveen Sood: సీబీఐ డైరెక్టర్‌కు అస్వస్థత

ABN , Publish Date - Sep 07 , 2025 | 06:28 AM

హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Praveen Sood: సీబీఐ డైరెక్టర్‌కు అస్వస్థత

  • అపోలో ఆస్పత్రికి తరలింపు

హైదరాబాద్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. శనివారం ఉదయం ప్రవీణ్‌ సూద్‌ శ్రీశైలం వెళ్లి మధ్నాహ్నం సీబీఐ గెస్ట్‌హౌ్‌సకు చేరుకున్నారు. ఈ క్రమంలో గుండెలో అసౌకర్యంగా ఉందని సిబ్బందికి చెప్పడంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు 24 గంటలు పర్యవేక్షణలో ఉంచాలని సూచించారు. ప్రవీణ్‌ సూద్‌ హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌ జోన్‌ అధికారులతో సమావేశమయ్యారు.

Updated Date - Sep 07 , 2025 | 06:29 AM