CBI Arrests: లంచం కేసులో ఇద్దరు కస్టమ్స్ అధికారుల అరెస్టు
ABN , Publish Date - Sep 03 , 2025 | 04:17 AM
లంచం కేసులో ఇద్దరు సీనియర్ కస్టమ్స్ అధికారులను అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈమేరకు మంగళవారం ఓ ...
లంచం కేసులో ఇద్దరు సీనియర్ కస్టమ్స్ అధికారులను అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈమేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీబీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ జీఎస్టీ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ నుంచి పెండింగ్‌లో ఉన్న పే ప్యారిటీ బిల్లు విడుదల చేయడానికి లంచం డిమాండ్ చేశారు. మొదట రూ. ముప్పై వేలు, తర్వాత చర్చల అనంతరం రూ. 25 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంతో సీబీఐ చేసిన ‘ట్రాప్ ఆపరేషన్’లో లంచం స్వీక రిస్తూ ఉండగా ఆ ఇద్దరు అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశామని సీబీఐ అధికారులు తెలిపారు.