kumaram bheem asifabad-రోడ్లపైనే పశువులు
ABN , Publish Date - Aug 05 , 2025 | 11:15 PM
వాంకిడి మండల కేంద్రంలోని జాతీయ రహదారి, సర్వీస్ రోడ్లుపై పశువు లు సంచరిస్తుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుం టున్నాయి. జాతీయ రహదారిపైనే కాకుండా సర్వీస్ రోడ్డు, కాలనీల్లోని అంతర్గత రోడ్లపైనా ఇష్టారీతిన సంచరిస్తుండడం వల్ల ప్రజలకు ఇబ్బందికరంగా మారు తోంది.
- అధికారులు చర్యలు తీసుకోవాలని వినతి
వాంకిడి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): వాంకిడి మండల కేంద్రంలోని జాతీయ రహదారి, సర్వీస్ రోడ్లుపై పశువు లు సంచరిస్తుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుం టున్నాయి. జాతీయ రహదారిపైనే కాకుండా సర్వీస్ రోడ్డు, కాలనీల్లోని అంతర్గత రోడ్లపైనా ఇష్టారీతిన సంచరిస్తుండడం వల్ల ప్రజలకు ఇబ్బందికరంగా మారు తోంది. ద్విచక్రవాహనదారులు వాటిని తప్పించే ప్రయ త్నంలో ప్రమాదాల బారిన పడి గాయపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో రహదారిపై పశువులు పోట్లాడుకుం టూ పక్క నుంచి వెళ్లే వాహదారులపై పడుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు..
ఇటీవల మండల కేంద్రంలోని సరండి చౌరస్తా సమీపంలో రహదారిపై ఉన్న పశువులు ఉండడంతో ద్విచక్రవాహనారుడు వాటిని తప్పించేయత్నం చేస్తుం డగా మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్లాడు. దీంతో ఆ రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారు గాయ పడ్డారు. మండల కేంద్రానికి చెందిన ఒక రైతు తన భార్యతో వ్యవసాయం పనులు ముగించుకొని ద్విచక్రవా హనంపై ఇంటికి తిరిగి వస్తుం డగా రహదారిపై రెండు పశువులు పోట్లాడుకుంటు వచ్చి తాకాయి. వాహనంపై నుంచి రోడ్డుపై పడడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. పశువులు రోడ్డుపై సంచరిస్తుండడంవల్ల ఇలాంటి సంఘటనలు అనేకంగా జరిగాయి. అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని వాహనదా రులు ఆరోపిస్తున్నారు. రోడ్డుపై వదిలివేసిన పశువులకు ప్రమాదవశాత్తు ఏదైనా వాహనం తగిలి పశువుకు ప్రమాదం జరిగితే పోషకులు నష్టపరి హారం కోసం డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రతి రోజు రోడ్డుపై పశువు లను వదిలివేయడం ఎంతవరకు సమంజసమని వాహ నదారులు ప్రశ్నిస్తున్నారు. రోడ్డుపై ఉన్న పశువులను బంజరుదొడ్లో వేసేలా చూడాలని, పశువులను రోడ్లపై వదలివేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
పశువుల సంచారంతో అవస్థలు..
- దుర్గం శ్యాంరావు, అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షుడు
నిత్యం పశువులు రోడ్డుపై సంచరిస్తుండడంతో వాహనదారులు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. రోడ్డు మధ్యలో పశువులు ఉండడంవల్ల వాటిని తప్పించ బోయే క్రమంలో ప్రమాదాలు జరిగి వాహనదారులు గాయపడుతున్నారు. ఇలా రోడ్లపై పశువులు సంచరి స్తున్నా పంచాయతీ అధికారులు మాత్రం పట్టించు కోవడం లేదు. పశువులను రోడ్డుపై వదిలివేస్తున్న యజమానులకు జరిమానాలు విధించడం ద్వారా కట్టడి చేసే అవకాశం ఉంది.