Share News

Caste Boycott Over Ganesh Donation: గణేష్‌ చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ

ABN , Publish Date - Sep 11 , 2025 | 05:14 AM

గణేష్‌ చందా ఇవ్వలేదన్న కోపంతో.. నాలుగు కుటుంబాలను కుల బహిష్కరణ చేసిన అమానుష ఘటన జగిత్యాల...

Caste Boycott Over Ganesh Donation: గణేష్‌ చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ

జగిత్యాల రూరల్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): గణేష్‌ చందా ఇవ్వలేదన్న కోపంతో.. నాలుగు కుటుంబాలను కుల బహిష్కరణ చేసిన అమానుష ఘటన జగిత్యాల జిల్లా కల్లెడ గ్రామంలో చోటు చేసుకుంది. గణేష్‌ నవరాత్రులకు సంబంధించిన చందా ఇవ్వలేదని కుల పెద్దలు తమ కుటుంబాలను కులం నుంచి వెలివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమతో ఎవరైనా మాట్లాడితే రూ.25 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించినట్లు వాపోయారు. ఈ ఘటనపై బాధితులు బుధవారం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - Sep 11 , 2025 | 05:14 AM