Yadagirigutta Lakshmi Narasimha Swamy temple: యాదగిరిగుట్టలో త్వరలో నగదు రహిత సేవలు
ABN , Publish Date - Sep 14 , 2025 | 05:45 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి భక్తులకు కొండపై త్వరలో నగదు రహిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు..
రూ.10 లక్షలతో 6 కియోస్క్ యంత్రాల ఏర్పాటు
యాదగిరిగుట్ట, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి భక్తులకు కొండపై త్వరలో నగదు రహిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు అందించే సేవల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు స్వీయసేవ (కియోస్క్) యంత్రాలను ఆలయ అధికారులు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఆ యంత్రాలను ప్రధాన కార్యాలయంలో ఆలయ ఈవో ఎస్.వెంకట్రావు శనివారం పరిశీలించారు. కెనరా బ్యాంకు యాదగిరిగుట్ట బ్రాంచ్ సౌజన్యంతో, రూ.10 లక్షల విరాళంతో దేవస్థానంలో కొత్తగా 6 కియోస్క్ యంత్రాలను అధికారులు సమకూర్చారు. ఈ యంత్రాల ద్వారా దర్శనాలు, ప్రసాదాలు, వ్రతాలు, విరాళాలతో పాటు ఇతర సేవలను భక్తులు సులభంగా నగదు రహితంగా పొందవచ్చని ఈవో ఎస్.వెంకట్రావు తెలిపారు.