Share News

ఉత్తమ ప్రతిభకు నగదు బహుమతి

ABN , Publish Date - Apr 26 , 2025 | 11:13 PM

విధి నిర్వహణలో ఉత్తమ ప్ర తిభ చూపిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌కు డీజీపీ జితేందర్‌ నగదు బహుమతి అందించి, అభినందనలు తెలిపారు.

ఉత్తమ ప్రతిభకు నగదు బహుమతి

- ఎస్‌ఐ, కానిస్టేబుల్‌కు డీజీపీ అభినందన

మంచిర్యాల క్రైం, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ఉత్తమ ప్ర తిభ చూపిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌కు డీజీపీ జితేందర్‌ నగదు బహుమతి అందించి, అభినందనలు తెలిపారు. గంజాయి కేసులో ఓ నిందితుడు ఎస్సా రెస్పీ కెనాల్‌లో దూకి పారిపోతుండగా రామగుండం కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న ఎస్‌ఐ ఉపేందర్‌ ప్రాణాలకు తెగించి అందులో దూకి నిందితు డిని పట్టుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం హైదరాబా ద్‌లోని డీజీపీ కార్యాలయంలో ఎస్‌ఐ ఉపేందర్‌తో పాటు కానిస్టేబుల్‌ సంప త్‌కు నగదు బహుమతి అందించారు. డీజీపీ జితేందర్‌తో పాటు నార్కొటిక్స్‌ ఏడీజీ సందీప్‌ శాండిల్యలు వారిని ప్రత్యేకంగా అభినందించారు. నగదు రివార్డులు అందుకున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్‌కు రామగుండం పోలీస్‌ కమీషన ర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీజీ (లా అండ్‌ ఆర్డర్‌) మహేష్‌ భగవత్‌, ఏడీజీ(పర్సనల్‌) అనిల్‌, నార్కొటిక్స్‌ ఎస్‌పీ రూపేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 11:13 PM