ప్రత్యేక కార్యాచరణతో కేసులు ఛేదించాలి
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:07 PM
ప్రత్యేక కార్యాచరణ తో కేసులను ఛేదించి, ప్రతీ కేసులో నూ బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నా రు.
- డీఎస్పీ కార్యాలయం తనిఖీలో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్
అచ్చంపేటటౌన్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : ప్రత్యేక కార్యాచరణ తో కేసులను ఛేదించి, ప్రతీ కేసులో నూ బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నా రు. గురువారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ తనిఖీ చేశారు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ నాగరాజు, ఎస్‌ఐ విజయ్‌భాస్కర్‌లు ఎస్పీకి మొక్కను ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఠాణాలో రికా ర్డులను తనిఖీ చేసి విచారణలో ఉన్న కేసుల వి వరాలను డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. అ నంతరం ఠాణా ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. సర్కిల్‌లోని నేరాలకు సంబం ధించి సూచనలు ఇచ్చారు. రికార్డులను పరిశీ లించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.