Case Against Bhatti and Uttam: భట్టి, ఉత్తమ్‌లపై కేసు కొట్టివేత
ABN , Publish Date - Aug 19 , 2025 | 03:44 AM
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై నమోదైన ఓ ...
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై నమోదైన ఓ క్రిమినల్ కేసును హైకోర్టు సోమవారం కొట్టివేసింది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండు చేస్తూ 2021లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్‌భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. దీనిపై సైదాబాద్ పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ వారు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లుగానీ, ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్లుగానీ, శాంతిభద్రతలకు విఘాతం కలిగినట్లు గానీ ఆధారాలు లేవని పేర్కొంటూ కేసును కొట్టివేసింది.