Share News

Car Plunges into Petrol Bunk: మంటలతో పెట్రోల్‌ బంకులోకి దూసుకెళ్లిన కారు

ABN , Publish Date - Dec 27 , 2025 | 04:05 AM

కోరలు చాస్తున్న మంటలతో కారు అదుపుతప్పి నేరుగా పెట్రోలు బంక్‌లోకే దూసుకొస్తే? అదెంత ప్రమాదమో తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ! మేడ్చల్‌ జిల్లా పోచారం....

Car Plunges into Petrol Bunk: మంటలతో పెట్రోల్‌ బంకులోకి దూసుకెళ్లిన కారు

  • మేడ్చల్‌ జిల్లాలో ఘటన.. తప్పిన పెను ప్రమాదం

  • కార్లోంచి బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్న డ్రైవర్‌

ఘట్‌కేసర్‌ రూరల్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కోరలు చాస్తున్న మంటలతో కారు అదుపుతప్పి నేరుగా పెట్రోలు బంక్‌లోకే దూసుకొస్తే? అదెంత ప్రమాదమో తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ! మేడ్చల్‌ జిల్లా పోచారం ఐటీ కారిడార్‌ పరిధిలోని అన్నోజిగూడ భారత్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఇదే జరిగింది. కదులుతున్న మారుతి ఓమ్నిలో ఎలా చెలరేగాయో కానీ ఒక్కసారిగా రేగిన మంటలకు జడిసి ఆ వాహనాన్ని నడుపుతున్న రాజు అనే యజమాని కిటికీలోంచి బయటకు దూకేశాడు. తర్వాత ఆ వాహనం నేరుగా పెట్రోలు బంకులోకి దూసుకెళ్లి.. దానికదే నిలిచిపోయింది. అప్రమత్తమైన బంక్‌ సిబ్బంది ఫోమ్‌తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. బంక్‌ సూపర్‌వైజర్‌ మట్టయ్య ఫోమ్‌తోపాటు నీళ్లతో మంటలు అదుపు చేస్తూనే పెద్ద రాడ్‌తో కారును బంక్‌ నుంచి బయట సర్వీసురోడ్డు దాకా నెట్టాడు. సీఐ రాజు వర్మ ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Updated Date - Dec 27 , 2025 | 04:05 AM