Share News

చెంచుల అభివృద్ధిని ఓర్వలేకపోతున్నావ్‌

ABN , Publish Date - May 21 , 2025 | 11:00 PM

చెంచుజాతిని అభివృద్ధి చేస్తుంటే మాజీ ఎమ్మె ల్యే గువ్వల బాలరాజు ఓర్వలేక పోతున్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.

చెంచుల అభివృద్ధిని ఓర్వలేకపోతున్నావ్‌
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

- మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఫైర్‌

లఅచ్చంపేటటౌన్‌, మే 21 (ఆంధ్రజ్యోతి) : చెంచుజాతిని అభివృద్ధి చేస్తుంటే మాజీ ఎమ్మె ల్యే గువ్వల బాలరాజు ఓర్వలేక పోతున్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకర్ల సమావే శంలో మాట్లాడారు. అచ్చంపేట నియోజకవర్గంలో చెంచుల అభ్యు న్నతి కోసం ముఖ్యమంత్రి ఇందిర సౌరగిరి జలవికాసం పథకం తీసుకొస్తే జనస మీకరణ, చెంచుల ఉత్సాహం, హక్కున చేర్చుకొని ఆనం దభాష్పాలు రాల్చిన వారి ఆనందాన్ని చూసి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తట్టుకోలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమె త్తారు. రూ.100 కోట్లకు అమ్ముడుపోయిన దొం గవి నువ్వు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీకులేదన్నారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన పథకం అమలుకు నోచుకోదని ఇష్టంవచ్చినట్లు మాట్లాడడం కాదని, నువ్వు బోరు వేసుకున్నా సోలార్‌ పంపుసెట్లు ఇస్తా మని, అప్పుడైనా అర్థమవుతుందన్నారు. నువ్వు నల్లమల బిడ్డవు కాదని, వలస బిడ్డవని, అం దుకే అచ్చంపేట మీద నీకు ప్రేమలేదని ఎమ్మె ల్యే వాపోయారు. తప్పుడు మాటలు మాట్లాడి తే, మేము నీ తప్పులను సాక్ష్యాలతో ప్రజల ముందు పెడతామన్నారు. విలేకరుల సమా వేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రాజేందర్‌, నాయకులు కాశన్న యాదవ్‌, గోపాల్‌రెడ్డి, మల్లేష్‌, గౌరీశంకర్‌, వెంకటయ్య, బాబు, ఖాదర్‌, వినోద్‌ పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2025 | 11:00 PM