Share News

అభ్యర్థులకు అసౌకర్యాలు కలగకుండా చూడాలి

ABN , Publish Date - Dec 05 , 2025 | 11:35 PM

నామినేషన్‌ కేంద్రాల్లో అభ్య ర్థులకు అసౌకర్యాలు కలగుకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చం ద్రయ్య పేర్కొన్నారు. శుక్రవారం భీమారం, బూరుగుపల్లి నామినేషన్‌ కేం ద్రాలను ఆయన పరిశీలించి తగు సూచనలు చేశారు.

అభ్యర్థులకు అసౌకర్యాలు కలగకుండా చూడాలి

భీమారం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : నామినేషన్‌ కేంద్రాల్లో అభ్య ర్థులకు అసౌకర్యాలు కలగుకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చం ద్రయ్య పేర్కొన్నారు. శుక్రవారం భీమారం, బూరుగుపల్లి నామినేషన్‌ కేం ద్రాలను ఆయన పరిశీలించి తగు సూచనలు చేశారు. కేంద్రాల్లో నీడ కో సం టెంట్లు, తాగునీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. రెవెన్యూ, వి ద్యుత్‌ అధికారులు అందుబాటులో ఉండి అభ్యర్థులకు కావాల్సిన ధృవప త్రాలను అందించాలన్నారు. అలాగే మండలంలోని భీమారం, మద్దికల్‌, బూరుగుపల్లి, ఖాజీపల్లి నామినేషన్‌ కేంద్రాలను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోహర్‌, జిల్లా వ్యయ పరిశీలకులు, ఆడిట్‌ అధికారి రా జశేఖర్‌లు పరిశీలించి రిటర్నింగ్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. వారి వెంట తహసీల్దార్‌ సదానందం, శ్రీరాంపూర్‌ సీఐ నవీన్‌, భీమారం ఎస్‌ఐ శ్వేత ఉన్నారు.

Updated Date - Dec 05 , 2025 | 11:35 PM