kumaram bheem asifabad- అభ్యర్థుల వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలి
ABN , Publish Date - Nov 30 , 2025 | 10:58 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచలు, వార్డు సభ్యుల వివరాలను టీ పోల్‌లో పకడ్బందీగా నమోదు చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ఆదివారం మండలంలోని సలుగుపల్లి నామినేషన్ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లాతో కలిసి పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో నామినేషన్ వేసిన అభ్యర్థుల దరఖాస్తులను ఫాం-2ఎ, 2బి రిపోర్టులను ఎప్పటికప్పుడు అందజేయాలని సూచించారు.
బెజ్జూరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచలు, వార్డు సభ్యుల వివరాలను టీ పోల్‌లో పకడ్బందీగా నమోదు చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ఆదివారం మండలంలోని సలుగుపల్లి నామినేషన్ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లాతో కలిసి పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో నామినేషన్ వేసిన అభ్యర్థుల దరఖాస్తులను ఫాం-2ఎ, 2బి రిపోర్టులను ఎప్పటికప్పుడు అందజేయాలని సూచించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని, కోడ పక్కాగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఎంపీవో శ్రీనివాస్, ఆర్వో తిరుపతి, ఏఆర్వో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎల్కపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏరాపటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఆదవారం జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా పరిశీలించారు. నామినేషన్ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. పోలీసు అధికారులు భద్రత ఏర్పాటు చూడాలని, నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూంలో వాహనాలు ఉండే విధంగా చూడాలని చెప్పారు. నామినేషన్ కేంద్రంకు ముగ్గురు అభ్యర్థులను మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. వారి వెంట ఎంపీడీవో ఆల్బర్ట, తహసీల్దార్ తిరుపతి, ఆర్‌ఐ అనిల్‌కుమార్ తదితరులు ఉన్నారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్‌ల, వార్డు సభ్యుల నామినేషన్ పత్రాల వివరానలు కంప్యూటర్‌లో నమోదు చేయాలని కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా అన్నారు. దహెగాం మండల కేంద్రంలోని రైతు వేదిక, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నామినేషన్ కేంద్రాలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. నామినేషన వేయడానికి వచ్చే అభ్యర్థులకుఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు. పోలీసు అధికారులు భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ మునావర్ షరీఫ్, ఎంపీడీవో నస్రుల్లాఖాన్, ఎంపీఓ శ్రీనివాస్, ఎంఆర్‌ఐ నాగభూషణం, తదితరులు ఉన్నారు.