Color on EVMs: ఈవీఎంలపై రంగుల్లో అభ్యర్థుల ఫొటోలు
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:25 AM
పోటీలో ఉన్న అభ్యర్థులను ఓటర్లు సులభంగా గుర్తించేందుకు వీలుగా ఈవీఎంలపై రంగుల ఫొటోలు ముద్రించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి .....
సున్నితమైన కేంద్రాల్లో ఏఐ ఆధారిత పర్యవేక్షణ: సీఈవో
హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : పోటీలో ఉన్న అభ్యర్థులను ఓటర్లు సులభంగా గుర్తించేందుకు వీలుగా ఈవీఎంలపై రంగుల ఫొటోలు ముద్రించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏర్పాట్లపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఇందులో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఆమ్‌ఆద్మీ, మజ్లిస్ తదితర పార్టీల ప్రతినిధులు, అదనపు సీఈవో లోకేశ్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, డిప్యూటీ సీఈవోలు హరిసింగ్, సత్యవాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ ఈసీఐ కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ తీసుకొచ్చిన నూతన సంస్కరణలను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో ఏఐ ఆధారిత పర్యవేక్షణ, జీపీఎస్ ట్రాకింగ్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. రియల్‌టైమ్ ఓటింగ్ టర్నౌట్ మానిటరింగ్ కోసం డిజిటల్ డ్యాష్‌బోర్డులు, మొబైల్ యాప్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.