R Krishnaiah: బీసీలను రాజకీయంగా అణచివేతకు కుట్ర
ABN , Publish Date - Oct 14 , 2025 | 02:48 AM
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువడి, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా స్థానిక సంస్థల...
నోటిఫికేషన్ వచ్చాక స్టే ఇవ్వడమేంటి
18న తెలంగాణ బంద్‌కు పిలుపు: కృష్ణయ్య
బీసీని సీఎం చేయాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్
గన్‌పార్క్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువడి, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపి వేస్తూ హైకోర్టు స్టే ఇవ్వడం కుట్రపూరితంగా బీసీలను రాజకీయంగా అణచివేయడమేనని బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్, ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 18న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ బంద్ పోస్టర్‌ను సోమవారం గన్‌పార్కులో విడుదల చేశారు. ఈ బంద్‌కు 30 బీసీ సంఘాలు, 25 కుల సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ, రాజ్యాంగంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం, అగ్రవర్ణాల వారు కోర్టుకు వెళ్లి అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. బీసీలను అణచివేస్తే తిరుగుబాటు తప్పదని, వారికి మనుగడ ఉండదని హెచ్చరించారు. జేఏసీ కో చైర్మన్ జాజుల శ్రీనివా్‌సగౌడ్ మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో 1100 మంది బీసీలు ఆత్మబలిదానం చేసుకున్నారని గుర్తు చేశారు. బీసీ సీఎం కావాలని డిమాండ్ చేశారు. బీసీల ఆత్మగౌరవం ఎజెండాగా పోరాటం కొనసాగిస్తామన్నారు. బీసీల పట్ల కోర్టులు, ప్రభుత్వం, ప్రతిపక్షాలు అణచివేసే ధోరణి అవలంబిస్తున్నాయని జేఏసీ వైస్ చైౖర్మన్ వీజీఆర్ నారగోని మండిపడ్డారు.