Memorial Construction: కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారకాన్ని నిర్మించాలి
ABN , Publish Date - Sep 22 , 2025 | 06:41 AM
తెలంగాణ జాతిపితగా కొండా లక్ష్మణ్ బాపూజీని ప్రకటించి ఆయన పేరిట స్మారకాన్ని నిర్మించాలని పలువురు మేధావులు, ఉద్యమకారులు, బీసీ సంఘాల నేతలు కోరారు.
బాపూజీ సామాజిక తెలంగాణ వారోత్సవాల్లో వక్తలు
ఖైరతాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ జాతిపితగా కొండా లక్ష్మణ్ బాపూజీని ప్రకటించి ఆయన పేరిట స్మారకాన్ని నిర్మించాలని పలువురు మేధావులు, ఉద్యమకారులు, బీసీ సంఘాల నేతలు కోరారు. బాపూజీ వర్ధంతి రోజైన ఆదివారం నుంచి జయంతి రోజైన ఈ నెల 27 వరకు కొండా లక్ష్మణ్ బాపూజీ సామాజిక తెలంగాణ వారోత్సవాలను కొండా లక్ష్మణ్ బాపూజీ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించారు. బాపూజీ వర్ధంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ సమీపంలోని ఆయన విగ్రహం వద్ద టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్, ఎమ్మెల్సీలు రమణ, అద్దంకి దయాకర్, టీఎండీసీ చైర్మన్ అనిల్, మాజీ ఎంపీలు మధుయాష్కీగౌడ్, రాపోలు ఆనంద భాస్కర్ తదితరులు నివాళులర్పించారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన స్ఫూర్తితోనే బీసీల్లో చలనం మొదలైందని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.