కలెక్టరేట్ ఎదుట కేబుల్ టీవీ ఆపరేటర్లు ధర్నా
ABN , Publish Date - Jun 12 , 2025 | 11:52 PM
కేబుల్ టీవీ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా జ రిగింది. జిల్లాలోని విఽవిధ మండలాలు, పట్టణాలకు చెందిన కేబల్ టీవీ ఆపరేటర్లు ఇక్కడకు తరలివచ్చారు. కలెక్టరేట్ చౌరస్తా నుంచి ప్రధాన ధ్వా రం వరకు ర్యాలీ నిర్వహించి ఆందోళనకు దిగారు.
నస్పూర్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి) : కేబుల్ టీవీ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా జ రిగింది. జిల్లాలోని విఽవిధ మండలాలు, పట్టణాలకు చెందిన కేబల్ టీవీ ఆపరేటర్లు ఇక్కడకు తరలివచ్చారు. కలెక్టరేట్ చౌరస్తా నుంచి ప్రధాన ధ్వా రం వరకు ర్యాలీ నిర్వహించి ఆందోళనకు దిగారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయ ఏఓ రాజేశ్వర్‌కు అందించారు. అలాగే విద్యుత్ వాఖ అధికారి వినతి అందజేశారు. అనంతరం కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్పే ర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గూడ రాంరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యాక్షుడు దో మల రమేష్‌లు మాట్లాడుతూ కేబుల్ టీవీ ద్వారా ప్రతి ఇంటికి తక్కువ చా ర్జీలతో ప్రజలకు ప్రత్యక్ష ప్రసారాలను, వినోద చానళ్లను చూపిస్తున్నామన్నా రు. మూడు దశాబ్దాలుగా ప్రజలకు సేవలందిస్తున్న తమపై విద్యుత్ పోల్ బిల్లు పెంచాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే ఆపరేటర్లపై భార పడుతుందని, విద్యుత్ పోల్ బిల్లు పెంచితే మోయలేని భారం పడు తుం దన్నారు. తామే పోల్ బిల్లు చెల్లిస్తున్నమని, ఇరత నెట్ కార్పోరేట్ సంస్థలు స్తంభాలను వాడుతున్నరని, కానీ పోల్ బిల్లు చెల్లించడంలేద న్నారు. కేబుల్ టీవిల రీచార్జీలు తగ్గిపోయయాన్నారు. ప్రభుత్వం ఆలోచించి పోల్ బిల్లును రద్దు చేయాలని విన్నవించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కేబుల్ టీవీ ఆ పరేటర్స్ అసోసియేషన్ నాయకులు భాస్కర్ల రాజేశం, గాండ్ల సత్యం, పం బాల తిరుపతి, వెంకన్న,రాజేందర్, రవీందర్, మల్లేష్, రాజు, శేఖర్ జిల్లా లోని వివిధ మండలాలకు చెందిన కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు.