Busy Schedule: నాలుగు రోజులు బిజీబిజీగా సీఎం రేవంత్
ABN , Publish Date - Sep 22 , 2025 | 05:23 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 4 రోజుల పాటు బిజిబిజీగా గడపనున్నారు. సోమవారం ఉదయం కేంద్ర రహదారుల ప్రాజెక్టులు, భూ సేకరణ అంశాలకు...
హైదరాబాద్, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 4 రోజుల పాటు బిజిబిజీగా గడపనున్నారు. సోమవారం ఉదయం కేంద్ర రహదారుల ప్రాజెక్టులు, భూ సేకరణ అంశాలకు సంబంధించి ఢిల్లీ నుంచి వచ్చే అధికారులతో సమీక్షిస్తారు. మధ్యాహ్నం పురపాలక శాఖపై సమీక్ష చేస్తారు. కాగా మంగళవారం మేడారం పర్యటనకు వెళ్లనున్నారు. సమ్మక్క-సారలమ్మల ప్రాంగణం అభివృద్ధికి సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌పై అక్కడే చర్చిస్తారు. 24న పాట్నా వెళ్తారు. అక్కడ జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొంటారు. 25వరకు అక్కడే ఉంటారని సమాచారం.