రూ.598కోట్ల వ్యాపారం
ABN , Publish Date - Jul 01 , 2025 | 12:45 AM
గతంలో ఎన్నడూలేని విధంగా ఈ సంవత్సరం రూ.598.16కోట్లకు పైగా బ్యాంకు వ్యాపారం జరిగిందని, దీంతో డీసీసీబీ రూ.2940.29కోట్లకు చేరుకుందని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.
డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి
నల్లగొండ, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): గతంలో ఎన్నడూలేని విధంగా ఈ సంవత్సరం రూ.598.16కోట్లకు పైగా బ్యాంకు వ్యాపారం జరిగిందని, దీంతో డీసీసీబీ రూ.2940.29కోట్లకు చేరుకుందని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్‌గా కుంభం శ్రీనివా్‌సరెడ్డి బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పాలకవర్గ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకవర్గం ఏర్పాటు చేసిన వెంటనే ఈ సంవత్సర కాలంలో క్రాఫ్‌లోన్ గరిష్ట పరిమితిని లక్ష రూపాయల నుంచి రూ.1.50లక్షలకు పెంచినట్లు తెలిపారు. అదేవిధంగా రుణాల విషయంలో పాత పాస్ పుస్తకాలు అవసరం లేకుండా నిర్ణయం తీసుకున్నామన్నారు. పాలక వర్గం క్రాప్‌లోన్ బడ్జెట్ రూ.100కోట్లకు పైగా తీసుకొచ్చినట్లు తెలిపారు. నూతన పథకాల్లో భాగంగా ఎన్‌ఎల్‌ఎం, గ్రామీణ ప్రాంతాలల్లో గృహ రుణాలు, సొసైటీలకు గోదాంల నిర్మాణం కోసం వరల్డ్ లాడ్జీ గ్రైండ్ స్టోరేజీ ప్రాజెక్టు తెచ్చినట్లు తెలిపారు. బ్యాంకు అభివృద్ధికి సహకరించిన పాలకవర్గ సభ్యులను, బ్యాంకు అధికారులు, ఉద్యోగులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పాశం సంపత్ రెడ్డి, కొండ సైదయ్య, విరిగినేని అంజయ్య, గుడిపాటి సైదయ్య, దనావత్ జయరాం, బంటు శ్రీనివాస్, కోడి సుష్మ, కొమ్ము కరుణ, కె.వీరస్వామి, బ్యాంకు సీఈవో శంకర్‌రావు, జీఎం నర్మద పాల్గొన్నారు.