Share News

kumaram bheem asifabad- వ్యాపారాలు డీలా

ABN , Publish Date - Nov 01 , 2025 | 10:11 PM

జిల్లాలో కొంత కాలంగా వ్యాపారాలు ఢీలా పడ్డాయి. దీంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఏ వ్యాపారం చేసినా కొద్దో గొప్పో లాభాలను తెచ్చిపెడుతుంది. కానీ ఇటీవల ఏ ఒక్క వ్యాపారిని కదిలించినా వ్యాపారమే లేదు అనే మాట అందరి నోట నుంచి వినిపిస్తోంది. జిల్లాలో ఆన్‌లైన్‌ షాపిం గ్‌ పై ప్రజలు ఎక్కవగా మక్కువ చూపుతుండ డంతో స్థానికంగా వ్యాపారాలు కుదేలవుతున్నాయి.

kumaram bheem asifabad- వ్యాపారాలు డీలా
:ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని వ్యాపారాల సముదాయం

- ఇంటి, దుకాణాల అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు

ఆసిఫాబాద్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొంత కాలంగా వ్యాపారాలు ఢీలా పడ్డాయి. దీంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఏ వ్యాపారం చేసినా కొద్దో గొప్పో లాభాలను తెచ్చిపెడుతుంది. కానీ ఇటీవల ఏ ఒక్క వ్యాపారిని కదిలించినా వ్యాపారమే లేదు అనే మాట అందరి నోట నుంచి వినిపిస్తోంది. జిల్లాలో ఆన్‌లైన్‌ షాపిం గ్‌ పై ప్రజలు ఎక్కవగా మక్కువ చూపుతుండ డంతో స్థానికంగా వ్యాపారాలు కుదేలవుతున్నాయి. ఈ ఏడాది దసరా,దీసావళి పండుగలకు ఆశించిన స్థాయిలో వ్యాపారాలు సాగలేదని చెబుతున్నారు. గతంలో పండుగలు వస్తున్నాయంటే వారం రోజుల ముందు నుంచే గిరాకీలతో సందడి సందడిగా ఉండి వ్యాపారాలు బాగా సాగేవని, ప్రస్తుతం అ లాంటి పరిస్థితులు లేవని వ్యాపారులు వాపోతు న్నారు. ఇటీవల దసరా, దీపావళి పండుగల సంద ర్భంలోనూ కొనుగోళ్లు నామమాత్రంగానే సా గాయ ని చెబుతున్నారు.

- జోరుగా ఆన్‌లైన్‌ వ్యాపారం..

జిల్లాలో ఆన్‌లైన్‌ వ్యాపారం రోజురోజుకు రెట్టింప వుతోంది. దీంతో జిల్లాలోని రిటైలర్స్‌, హోల్‌సెల్‌ మార్కెట్‌లపై తీవ్ర ప్రభావం ఏర్పడి వ్యాపారాలు పూర్తిగా దెబ్బతీస్తున్నాయని చెబుతున్నారు. ఒక్క క్లిక్‌తోనే అవసరమైన వస్తువులన్నీ ఇంటికేవస్తుండ డంతో ఆన్‌లైన్‌ ఆర్డర్‌ల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో వస్ర్తాలు, డ్రెస్‌లు, కాస్మోటిక్‌ , ఎలకా్ట్రనిక్స్‌ తదితర వస్తువుల కొనుగో ళ్లన్నింటిని ఆన్‌లైన్‌లోనే సాగుతున్నాయి. దీంట్లో రిటన్‌ ఫెసిలిటి కూడా ఉండడంతో యువత మరిం త మొగ్గు చూపుతున్నారు. ఆన్‌లైన్‌ బిజినెస్‌తో జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ పట్టణాలలోని షోరూంలు, దుకాణాలు పెట్టుకున్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలో వ్యాపారాలు ఢీలా పడడానికి మహాలక్ష్మి పథకం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. డిసెంబరు 9, 2023 నుంచి మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చింది. దీంతో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయా ణించే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. దీంతో బస్సులలో ఉచితంగా ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లాలో ఇప్పటివరకు ఒక కోటి యాబై లక్షలకు పైగా మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారని ఆర్టీసీ అధికారుల గణంకాలను బట్టి తెలుస్తోంది. మ హిళలకు ఉచిత ప్రయాణంతో కొనుగోళ్లపై ప్రభావం పడింది. తమకు అవసరమైన వస్తువులను, వస్త్రాలను, నగలను దూర ప్రాంతాల్లో ఉన్న మం చిర్యాల, కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌ లాంటి నగరాలలో కొనుగోలు చేస్తుండడంతో స్థానికంగా కొనసాగుతున్న వ్యాపార వాణిజ్య సముదాయాలపై తీవ్ర ప్రభావం పడింది.

- కొనుగోళ్లు లేక..

వినియోగదారుల కొనుగోళ్లు లేక పోవడంతో దు కాణాల అద్దె, వర్కర్‌ల జీతాలు చెల్లించలేక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా కేంద్రంలోని కొన్ని వ్యాపార వాణిజ్య సముదా యాలు గిరాకీలు లేక వెలవెల బోతున్నాయి. కొన్ని దుకాణాల్లో ఉదయం నుంచి సాయంత్రం బోణీ కూడా కావడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో గిరాకీలు లేక ఉత్తారాది రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు దుకా ణాలను మూసుకుని వెళ్లి పోవాల్సిన పరిస్థితి నెలకొ న్నది. అలాగే గిరాకీలు లేక పోవడంతో రెండు దుకాణాలు ఉన్న వారు ఒక దుకాణానికే పరిమితం అవుతున్నారు. వేలకు వేల అద్దెలు, వర్కర్ల వేత నాలు చెల్లించేందుకు సైతం ఇబ్బందులు తలెత్తడం తో వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. కొంత మంది వ్యాపారులు అద్దెకు తీసుకున్న గదులను ఖా ళీ చేయడంతో జిల్లా కేంద్రంలో చాలా చోట్ల దుకా ణాల ముందు టు-లేటు బోర్డులు కనిపిస్తున్నాయి.

గిరాకీలు లేవు..

- సూర్యప్రకాష్‌ సొలంకీ, ఆసిఫాబాద్‌

మార్కెట్‌లో ఆశించిన స్థాయిలో గిరాకీలు లేవు. కొంత కాలంగా గిరాకీలు లేక వ్యాపారాలు ఢీలా ప డ్డాయి. మహాలక్ష్మి పథకంతో మహిళలు ఇతర ప్రాం తాలకు వెళ్లి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. దీంతో స్థానిక వ్యాపారాలపై ప్రభావం పడింది. దు కాణాల అద్దె చెల్లించడం కష్టతరంగా మారింది.

Updated Date - Nov 01 , 2025 | 10:12 PM