బస్టాండ్ లేక అవస్థలు
ABN , Publish Date - Jul 11 , 2025 | 12:56 AM
పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది నాంపల్లి మండల కేంద్రం పరిస్థితి. మండల కేంద్రంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. మండల కేంద్రంలో బస్టాండ్ లేక ప్రయాణికులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు.
బస్టాండ్ లేక అవస్థలు
ప్రభుత్వ మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు
మౌలిక వసతులు మృగ్యం
నాంపల్లి మండల కేంద్రంలో ప్రయాణికుల తిప్పలు
నాంపల్లి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది నాంపల్లి మండల కేంద్రం పరిస్థితి. మండల కేంద్రంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. మండల కేంద్రంలో బస్టాండ్ లేక ప్రయాణికులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. నిలువ నీడ లేక దుకాణాల మాటున ఉండాల్సిన పరిస్థితి. మౌలిక సదుపాయాలు కల్పించడంలో అటు పాలకులు, ఇటు అధికారులు విఫలమయ్యారు. దీంతో ప్రజల పరిస్థితి అధ్వానంగా మారింది.
నాంపల్లి పేరుకే మండల కేంద్రం, పెద్ద గ్రామ పంచాయతీ. నాంపల్లికి వచ్చే ప్రజలకు బస్టాండ్ లేక నీడ కరువైంది. దీంతో బస్సుల కోసం దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. ప్రజలకు కనీస అవసరాలు సమకూర్చలేని దుస్థితి. వివిధ పనుల నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి మండల కేంద్రానికి వచ్చేవారికి మౌలిక వసతులు అందని ద్రాక్షగా మారింది. దాహం వేస్తే గుక్కెడు నీళ్లు కూడా ఉచితంగా దొరకని పరిస్థితి. చివరికి ఒకటి వచ్చినా, రెండు వచ్చినా అవస్థలు పడాల్సిందే. మౌలిక వసతుల కల్పనలో గ్రామపంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. శనివారం వారాంతపు సంత ఉండటంతో ఎక్కువమంది రాకపోకలు సాగిస్తుంటారు. తహసీల్దార్, పోలీ్‌సస్టేషన ఎంపీడీవో కార్యాలయాలకు మండలంలోని ప్రజలు నిత్యం పలు పనుల కోసం వస్తుంటారు. దేవరకొండ, మిర్యాలగూడ, నల్లగొండ డిపోలకు నాంపల్లి మీదుగా పలు ప్రాంతాలకు బస్సులు వె ళ్తుండటంతో బస్సు డ్రైవర్లు, కండక్టర్లు మూత్రశాల లేక తీవ్రఇబ్బందు లు పడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే మ హిళా అధికారులు కూడా ఉదయం, సాయంత్రం సమయంలో బస్సుల కోసం వేసి చూస్తే ప్రదేశాల్లో టాయిలెట్స్ అవస్థలు పడుతున్నారు. నాంపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలకు వచ్చే విద్యార్థులు ప్రయాణికులు ఈ ప్రభుత్వ మరుగుదొడ్లు లేకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. నాంపల్లి మండల కేం ద్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే నాయకులు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నాంపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
మరుగుదొడ్లు లేక ఇబ్బందులు
మండల కేంద్రంలో మౌలిక వసతులు లేక పలు ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు తీవ్ర ఇ బ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు మరుగుదొడ్లు లేకపోవడం వల్ల తీవ్రంగా మానసిక ఆవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మండల కేంద్రంలో మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలి.
నక్క చంద్రశేఖర్, సింగిల్‌విండో మాజీ చైర్మన, నాంపల్లి
బస్టాండ్ నిర్మాణం చేపట్టాలి
పేరుకే మండల కేంద్రమైన పనుల నిమిత్తం నాం పల్లికి వచ్చే ప్రజలకు కనీసం నిలవడానికి నిలువ నీడ కరువైంది. మండలకేంద్రంలో బ స్టాండ్ నిర్మా ణం చేపట్టాలి. పాఠశాలలకు కళాశాలకు వచ్చే విద్యార్థులు బస్టాండ్ లేకపోవడంతో షాపుల ముందు నిలబడుతూ ఇబ్బందులకు గురవుతున్నారు.
నాంపల్లి సతీష్, బీజేవైఎం మండల అధ్యక్షుడు, నాంపల్లి