kumaram bheem asifabad- బస్సు సౌకర్యం కల్పించాలి
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:15 PM
ధనవంతులకు అవసరమైన రైలు సౌకర్యం కాదని, పేదలకు బస్సు సౌకర్యం కల్పించాలని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మాంతయ్య అన్నారు. మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు గురువారం కౌటాల భారీ ర్యాలీ నిర్వహించారు
కౌటాల, సెప్టెంబరు 18 ఆంధ్రజ్యోతి): ధనవంతులకు అవసరమైన రైలు సౌకర్యం కాదని, పేదలకు బస్సు సౌకర్యం కల్పించాలని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మాంతయ్య అన్నారు. మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు గురువారం కౌటాల భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు పేదలను చిన్న చూపు చూస్తూ పెద్దల కోసం ఖరీదైన రైలు సౌకర్యం కల్పిస్తున్నారన్నారు. రైలు సౌకర్యం కలిపిస్తే ఎవరు చెప్పడం లేదని కానీ ముందుగా మారు మూల గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. రెండు నెలలుగా రోడ్డు బాగు లేక తుమ్మిడిహెట్టికి ఆర్టీసీ బస్సు వెళ్లడం లేదని అన్నారు. దీంతో పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐ దిలీప్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌గౌడ్, వసంత్‌రావు, మధుకర్, బ్రహ్మయ్య, బాపు, మనీష్, బాజీరావు, శైజల, రవీందర్‌గౌడ్, రమేశ్, శ్రీనివాస్, తిరుపతి, భీమయ్య, లాంచ్ పటేల్, సంతోష్, శ్రీనివాస్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.