Share News

చిట్టీల పేరిట రూ.కోటికి బురిడీ

ABN , Publish Date - Jun 23 , 2025 | 12:42 AM

నమ్మకంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యాపారి రూ.లక్షల్లో చిట్టీలు నడుపుతూ బురిడీ కొట్టించాడు. ఈ సంఘటప నల్లగొండజిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరిగింది.

చిట్టీల పేరిట రూ.కోటికి బురిడీ

పోలీసులను ఆశ్రయించిన బాధితులు

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఘటన

మిర్యాలగూడ అర్బన్‌, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): నమ్మకంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యాపారి రూ.లక్షల్లో చిట్టీలు నడుపుతూ బురిడీ కొట్టించాడు. ఈ సంఘటప నల్లగొండజిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరిగింది. ఓ బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటపడింది. టూటౌన్‌ పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని శాంతినగర్‌కాలనీకి చెందిన కటకం సైదిరెడ్డి చిట్టీల వ్యాపారం సాగిస్తున్నాడు. కొంతకాలంగా కాలనీవాసులతో పరిచయాలు పెంచుకొని చిట్టీల వ్యాపారం మొదలుపెట్టాడు. నమ్మిన సుమారు 40మంది స్థానికులు రూ.2 నుంచి 5లక్షల వరకు చిట్టీలో సభ్యులుగా చేరారు. కొంతకాలంగా చిట్టీ డబ్బులను సకాలంలో చెల్లిస్తున్నాడు. ఏడాది రూ.5 నుంచి రూ.10 లక్షల చిట్టీలో కాలనీవాసులు సభ్యులుగా చేరారు. కొద్ది నెలలుగా చిట్టీలు పాడిన సభ్యులకు డబ్బులు చెల్లించడంతో కాలయాపన చేస్తున్నాడు. ఈ కాలనీలో చిట్టీ వ్యాపారంలో సభ్యులుగా చేరిన వారిలో వ్యాపారులు, ఉద్యోగుల కుటుంబాలే అధికంగా ఉన్నాయి. ఈ నెల రూ 5లక్షల చిట్టీని స్థానికంగా నివాసముంటు న్న అక్కనపల్లి శ్రావణి 14నెలల పాటు బాధితురాలు రూ.2.24 లక్షలు చెల్లించింది. రూ.5లక్షల చిటీని ఎత్తుకునేందుకు సిద్ధపడి చిట్టీ పాడి ఏజెం టు కమీషన్‌ మినహా మిగతా డబ్బుల కోసం చిట్టీల వ్యాపారి సైదిరెడ్డి ఇం టికి వెళ్లింది. కొద్దిరోజులుగా అతను కనిపించడం లేదని కాలనీవాసులు తెలిపారు. అతని ఫోన్‌నెంబర్‌కు కాల్‌చేసి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నింది. వారం రోజులుగా అతని ఫోన్‌ స్విచ్చాఫ్‌ అని వచ్చింది. అనుమానంతో బాధితురాలు టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించింది. శ్రావని ఫిర్యాదుతో మేల్కొన్న సుమారు 40మంది బాధితులు హడలెత్తిపోయి పోలీస్‌స్టేషన్‌ బాటపట్టారు. చిటీల వ్యాపారి సైదిరెడ్డి కోటి రూపాయల వరకు చిట్టీ డబ్బులతో ఉడాయించినట్లు బాధితులు లబోదిబోమన్నారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు చిట్టీల వ్యాపారి సైదిరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్‌ సీఐ సోమనర్సయ్య తెలిపారు.

Updated Date - Jun 23 , 2025 | 12:42 AM