kumaram bheem asifabad- కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం
ABN , Publish Date - Oct 17 , 2025 | 10:24 PM
బీసీలకు 43 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ చలో రాజ్‌భవన్ సందర్శంగా సీపీఎం నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం సీపీఎం నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం తీసుకు వచ్చిన జీవో 9ని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు
ఆసిఫాబాద్‌రూరల్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 43 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ చలో రాజ్‌భవన్ సందర్శంగా సీపీఎం నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం సీపీఎం నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం తీసుకు వచ్చిన జీవో 9ని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ రిజర్వేషన్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతిస్తుంటే మరి ఇప్పుడు ఈ రిజర్వేషన్‌ను ఎవరు అడ్డుకుంటున్నారో ప్రజలు, బీసీలు ఆలోచించాల న్నారు. బీసీ రిజర్వేషన్ అమలుకై శుక్రవారం శాంతియుతంగా చలో రాజ్‌భవన్ నిర్వహిస్తుంటే నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని చెప్పారు. చాలా మంది నా యకులకు దెబ్బలు తగిలాయని ఇది చాలా దారుణమన్నారు. శుక్రవారం నిర్వహించే రాష్ట్ర బంద్‌కు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాస్, దినకర్, కార్తీక్, రాజేందర్, కృష్ణమాచారి, నికల్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం సిర్పూరు కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్‌ను అమలు పర్చడం లేదన్నారు. ఇప్పటికైనా వెంటనే 9వ షెడ్యూల్‌లో చేర్చి పార్లమెంటులో ఆమోదం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు జాడి మల్లయ్య, రవి, చంద్రగిరి రాజన్న, మిట్టపల్లి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.