Share News

సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం

ABN , Publish Date - Nov 01 , 2025 | 11:04 PM

జూబ్లిహిల్స్‌ ఉప ఎ న్నికల ప్రచారంలో ప్రధానిని అవమాన పరుస్తూ మాట్లాడిన సీఎం రేవం త్‌రెడ్డి దిష్టిబొమ్మను శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ నాయ కులు దహనం చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం
మంచిర్యాలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీజేపీ నాయకులు

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : జూబ్లిహిల్స్‌ ఉప ఎ న్నికల ప్రచారంలో ప్రధానిని అవమాన పరుస్తూ మాట్లాడిన సీఎం రేవం త్‌రెడ్డి దిష్టిబొమ్మను శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ నాయ కులు దహనం చేశారు. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షుడు అమిరిశెట్టి రాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ దేశ మహిళల కుంకుమను తుడిచిన పాకిస్తాన్‌ గుం డాలపై ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ సింధూర్‌తో ప్రతి దాడి చేసిందన్నారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి ఉప ఎన్నికల్లో దేశ గౌరవాన్ని సైనికు ల త్యాగాలను అవమానపరుస్తూ కేవలం ఒక వర్గం ఓట్లకు కొమ్ముకాస్తూ ఎ న్నికల ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు. అబద్దాల హామీలతో గద్దెనె క్కి న రేవంత్‌రెడ్డి ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఇచ్చిన హా మీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వెంటనే రేవంత్‌రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌చేశారు. ఈ కా ర్యక్రమంలో నాయకులు కర్రె లచ్చన్న, బింగి సత్యనారాయణ, రాకేష్‌ రెన్వా, అశోక్‌, వెంకటేశ్వర్లు,వెంకటేష్‌, చిరంజీవి, కుమారస్వామి, శ్రీనివాస్‌, రవీంద ర్‌, రాజమౌళి, సతీష్‌, సాయికృష్ణ, శ్రీనివాస్‌, మనీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2025 | 11:04 PM