Share News

మోదీచిత్రపటాన్ని దహనం చేయడం హేయమైన చర్య

ABN , Publish Date - May 20 , 2025 | 11:30 PM

దేశ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటా నికి దహనం చేయడం హేయమైన చర్య అని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగు నూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ అన్నారు.

మోదీచిత్రపటాన్ని దహనం చేయడం హేయమైన చర్య
సోమగూడెంలో మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న బీజేపీ నాయకులు

కాసిపేట, మే20 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటా నికి దహనం చేయడం హేయమైన చర్య అని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగు నూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం సోమగూడెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మోదీ చిత్రపటాన్ని దహనం చేసిన దుశ్చర్యను ఖండిస్తు న్నామన్నారు. ఇలాంటి చర్యకు పాల్పడినవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బెల్లంపల్లి ఏసీపీకి వినతిపత్రం అందజేశారు. మోదీ చిత్రపటాన్ని దహనం చేసి అపవిత్రం చేయడం పట్ల క్షీరాభిషేకంతో శుద్ది చేస్తున్నామన్నారు. మోదీని అవమానించిన వారిని కఠిన శిక్షించి కఠిన చర్య లు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేని యెడల జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హచ్చరించారు. ఈ కార్యక్ర మంలో మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి వెంకటకృష్ణ, పుల్గం తిరుపతి, కోయల్‌కర్‌ గోవర్ధన్‌, శ్రీకృష్ణదేవరాయలు, తోడి రమేశ్‌, రాచర్ల సంతోష్‌, కాసిపేట మండల అధ్యక్షులు సూరం సంపత్‌, గజెల్లి రాజుకుమార్‌, దార కళ్యాణి, భరత్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2025 | 11:30 PM