బునాదిగాని కాల్వ పనులు చేపట్టాలి : సీపీఐ
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:14 AM
ఎన్ని ప్రభుత్వాలు మారినా 20 ఏళ్లుగా బునాది కాల్వ పూర్తికావడం లేదని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి అన్నారు.
మోత్కూరు, మే 31 (ఆంధ్రజ్యోతి): ఎన్ని ప్రభుత్వాలు మారినా 20 ఏళ్లుగా బునాది కాల్వ పూర్తికావడం లేదని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి అన్నారు. మోత్కూరులోని కేఆర్ భవన్‌లో శనివారం నిర్వహి ంచిన పార్టీ మండల కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. బునాదిగాని కాల్వ నిర్మాణానికి ప్రస్తుత ప్రభుత్వం రూ.267 కోట్లు మంజూరు చేసిందని చెబుతున్నా పనులు ప్రారంభిం చడం లేదన్నారు. బునాదిగాని కాల్వ పూర్తయితే మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం) మండలాల్లో సాగు నీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలన్నారు. షరతులు లేకుండా లబ్ధిదారులకు రూ.5లక్షలు చెల్లించాల న్నారు. అనంతరం పార్టీ గ్రామ శాఖలను ఎన్నుకున్నారు. మోత్కూరు పట్టణ శాఖ కార్యదర్శిగా బోయిని ఉప్పలయ్య, సహాయ కార్యదర్శులుగా గొలుసుల యాదగిరి, కడమంచి వీరస్వామి, కొండగడప గ్రామ శాఖ కార్యదర్శిగా తొంట తిరుపయ్య, పాటిమట్ల, దాచారం, బుజిలాపురం, పొడిచేడు, దత్తప్పగూడెం, ముశిపట్ల శాఖల కార్యదర్శులుగా దొండ రాములు, సిరిగిరి మత్స్యగిరి, చేతరాశి సత్తయ్య, ఎర్రబాబు, వల్లపు అంతయ్య, ఎండి.అబ్బాస్ అలీని ఎన్నుకున్నారు.