Minister Tummala Nageswara Rao: బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ ను..సంక్రాంతి నాటికి ప్రారంభించాలి
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:53 AM
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగంలో గేమ్ చేంజర్‌గా బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ మారనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తంచేశారు....
అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగంలో గేమ్ చేంజర్‌గా బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ మారనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తంచేశారు. సంక్రాంతి నాటికి ఫుడ్‌పార్క్‌ను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఫుడ్ పార్క్ పురోగతిపై తుమ్మల సమీక్షించారు. 2016లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. పీఎంకేఎ్‌సవై పథకం కింద ఈ మెగాఫుడ్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. మెగా ఫుడ్‌పార్క్ మొత్తం వ్యయం 109కోట్లు. ప్రస్తుతం 26 ఎకరాల్లో పలు కంపెనీలకు ప్లాట్లు కేటాయించారు. తాజాగా నెక్ట్స్‌జెన్ సంస్థకు స్థలం కేటాయించారు. ఆక్వా రంగంలో రూ. 615కోట్ల పెట్టుబడులతో ఈ సంస్థ 3,200 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది.